ఆ రెండూ ఫ్లాఫ్...అష్టాచమ్మే టాప్ (ట్రేడ్ టాక్)

ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన సముద్ర చిత్రం 'మల్లెపువ్వు' ట్రేడ్ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. భూమిక ఇమేజ్, ఇళయరాజా సంగీతం రెండూ ఆ చిత్రాన్నిగట్టెక్కించలేకపోయాయి. చేతబడుల నేపథ్యంతో రూపుదిద్దుకొన్న 'రక్ష' ఓపనింగ్స్ పర్వాలేదనిపించినా...పబ్లిసిటీ విపరీతంగా చేస్తున్నా ప్రేక్షకులు ఇలాంటి చిత్రాల ద్వారా ఆశించే ధ్రిల్ వారికి దొరక్క పోవటంతో చేతులెత్తేసింది. అలాగే మొన్న గురువారం రిలీజ్ అయిన గోపీచంద్ శౌర్యం సినిమా ఫరవాలేదనిపించే టాక్ తో ముందుకెళ్తోంది.


Click it and Unblock the Notifications