Malli Pelli day 1 Collections షాకింగ్‌గా మళ్లీ పెళ్లి కలెక్షన్లు.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ప్రతిష్టాత్మక విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై వీకే నరేష్ నిర్మించగా, ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన చిత్రం మళ్లీ పెళ్లి. రిలీజ్‌కు ముందు వీకే నరేష్, పవిత్రా లోకేష్ జీవితం ఆధారంగా రూపొందిందనే ఊహగానాల నేపథ్యంలో ఈ సినిమాకు మంచి క్రేజ్ లభించింది. టీజర్లు, ట్రైలర్లలో కంటెంట్ భారీ అంచనాలు పెంచాయి. మే 26న మంచి బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే..
మళ్లీ పెళ్లి సినిమా విషయానికి వస్తే.. వీకే నరేష్ తన భార్య రమ్య రఘుపతి మధ్య వైవాహిక విభేదాలు, అలాగే పవిత్ర లోకేష్‌తో రిలేషన్ షిప్ అంశాలు మీడియాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. టీజర్, ట్రైలర్లలో అలాంటి సీన్లు కనిపించడంతో ఈ ముగ్గురి జీవితాలకు సంబంధించిన సినిమా అని ఫిక్స్ అయ్యారు. రిలీజ్ తర్వాత వారి కథనే ఎమోషనల్‌గా చిత్రీకరించారనే విషయం స్పష్టమైంది.

విజయ నిర్మల ప్రారంభించిన విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై ఎన్నో మంచి చిత్రాలు వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత తన తల్లి విజయ నిర్మల స్మారకంగా మళ్లీ ఈ బ్యానర్‌ను తెరపైకి తెచ్చారు. అయితే తన జీవితంలో కీలక సంఘటనలు, అలాగే తన తల్లి జీవితానికి సంబంధించిన సన్నివేశాల ఆధారంగా మళ్లీ పెళ్లి సినిమాను తెరకెక్కించారు.
మళ్లీ పెళ్లి సినిమాకు కథను ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు అందించారు. ఈ సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారనే విషయం ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ట్రేడ్ వర్గాలు వెల్లడించిన ప్రకారం మళ్లీ పెళ్లి సినిమాను 16 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే ఈ సినిమాను స్వయంగా రిలీజ్ చేయడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు అందుబాటులోకి రాలేదు.
ఇదిలా ఉండగా, ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ కారణంగా మళ్లీ పెళ్లి సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. అయితే వీకే నరేష్, పవిత్ర లోకేష్ కారణంగా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాకు తొలి రోజు 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మళ్లీ పెళ్లి సినిమాకు ఉన్న క్రేజ్‌కు తగినట్టుగానే ఓపెనింగ్స్ కూడా మంచిగానే నమోదు అయ్యాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల రూపాయల కలెక్షన్లు నమోదు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్, కన్నడ భాషల్లో కలిపి ఈ చిత్రం మొత్తంగా 1 కోటి రూపాయలు తొలి రోజు నమోదు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











