Rebel Collections ప్రేమలు హీరోయిన్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. జీవీ ప్రకాశ్ సినిమా పరిస్థితి ఏమిటంటే?

ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో నిఖేష్ దర్వకత్వంలో నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా, ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటించిన చిత్రం రెబెల్. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 22వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్, ప్రీరిలీజ్ బిజిెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.

ఇక రెబెల్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో భారీగా నిర్మించారు. ఈ సినిమాకు అరుణ్ కృష్ణ, రాధాకృష్షన్, వెట్రే క్రిష్ణనమ్ లాంి టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ పనిచేశారు. దాంతో ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్స్ అన్ని కలిపి మొత్తంగా ఈ సినిమాకు 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Mamitha Baiju s Rebel Movie Expected Box Office Collections Worldwide GV Prakash Kumar Movie slow at GBOC

జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా కాలేజీలో ప్రాంతాల వివక్ష నేపథ్యంగా తెరకెక్కింది. జీవీ ప్రకాశ్, మమితాకు యాక్టింగ్ భారీ రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమా తొలి రోజున మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ మూవీకి ఊహించినంత మేరకు ఓపెన్సింగ్స్ సాధించలేకపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక మిక్స్‌డ్ టాక్ కారణంగా ఈ చిత్రానికి తక్కువ ఆక్యుపెన్సీ నమోదైంది. మార్నింగ్ షోకు 20 శాతం, మ్యాట్నికి 30 శాతం, ఫస్ట్ షోకు 45 శాతం, సెకండ్ షోకు 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక చెన్నై, మధురై, కొచి, త్రివేండ్రం లాంటి ప్రధాన నగరాల్లో తక్కువ స్పందన లభించింది. పాండిచ్చేరిలో అత్యధికంగా 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

Mamitha Baiju s Rebel Movie Expected Box Office Collections Worldwide GV Prakash Kumar Movie slow at GBOC

ఇక తమిళంలో ఈ సినిమాకు తొలి రోజు అంతంత మాత్రంగానే కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా వీకెండ్‌లో వసూళ్లు పుంజుకొంటాయా? లేదా అనేది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. ఇక ఈ సినిమా తమిళనాడులో 1 నుంచి 1.5 కోట్ల రూపాయలు, కన్నడలో 50 లక్షలు, ఇతర ప్రాంతాల్లో 25 లక్షల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేశారు.

ఇక రెబెల్ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమా కనీసం 20 కోట్ల రూపాయలు వసూలు చేస్తే గానీ.. లాభాల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు పుంజుకొని భారీ వసూళ్లు రాబట్ట గలిగితే.. హిట్ స్టేటస్ సాధించే అవకాశం ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X