MSVPG Overseas Collections: ఓవర్సీస్‌లో శంకర వరప్రసాద్ సంచలనం.. చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ ఎంటర్‌టైనర్ మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). తన కెరీర్‌లో 157వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు వరుస సక్సెస్‌లతో తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మించారు

ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటించారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్‌తో సందడి చేశారు. .ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో వ్యవహరించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Mana Shankara Vara Prasad Garu Overseas Box Office Report

వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంతంటే?
ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఆంధ్రా థియేట్రికల్ హక్కులు 55 కోట్ల రూపాయలు, నైజాం హక్కులు 32 కోట్ల రూపాయలు, సీడెడ్ రైట్స్ 18 కోట్ల రూపాయల మేర వాల్యూ జరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. కర్ణాటక హక్కులు 10 కోట్ల మేర, ఇతర రాష్ట్రాల రైట్స్ 5 కోట్ల మేర జరిగింది. దాంతో ఇండియా రైట్స్ సుమారుగా 120 కోట్ల మేర వాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఓవర్సీస్ రైట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయల మేర ట్రేడ్ జరిగింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల రూపాయల మేర జరిగిందనే టాక్ బిజినెస్ వర్గాల్లో ఉంది.

ఓవర్సీస్‌లో భారీగా
భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది. విడుదలైన ప్రతీ చోట కాసుల వర్షం కురిపిస్తున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ఓవర్సీస్‌లో మంచి స్పందన లభిస్తున్నది. హాలీవుడ్ సినిమాలు, సంక్రాంతి పండుగ సినిమాలు పోటీని తట్టుకొని భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధిస్తున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

నార్త్ అమెరికాలో
నార్త్ అమెరికాలో శంకర వరప్రసాద్ చిత్రం భారీగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు అమెరికా, కెనడాలో కలిపి 2.5 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ వారాంతంలో ఈ చిత్రం 3 మిలియన్ డాలర్లు వసూళ్లకు చేరువ కావడం గ్యారెంటీ అనే విశ్వాసాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఆస్ట్రేలియాలో కలెక్షన్లు
ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమా రికార్డు వసూళ్లను నమోదు చేసిందని శంకర వరప్రసాద్ నిర్మించిన షైన్ స్క్రీన్ అధికారికంగా కలెక్షన్లను ప్రకటించింది. ఈ చిత్రం 4 రోజుల్లో 300K ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 2 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

యూకే, ఐర్లాండ్ దేశాల్లో
ఇదిలా ఉండగా, యూకే, ఐర్లాండ్ దేశాల్లో కూడా మన శంకర వరప్రసాద్ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం గత 4 రోజుల్లో భారీగా అంటే.. సుమారుగా 202K పౌండ్స్ అంటే.. బారతీయ కరెన్సీలో 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాకు ఇంకా భారీగా డిమాండ్ కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్ కలెక్షన్లు ఎంతంటే?
ఓవర్సీస్‌లో శంకర వరప్రసాద్ గారి హావా కొనసాగుతుందనే విషయం కలెక్షన్లు రుజువు చేస్తున్నాయి. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో కలిపి ఈ సినిమా 27.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మిడిల్ ఈస్ట్, మలేషియా, సింగపూర్, ఇతర దేశాల వసూళ్ల సమాచారం అందాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X