Mana Shankara Vara Prasad Garu Box Office: మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ కలెక్షన్లు.. యూఎస్‌లో రచ్చ1
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 157వ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasadgaru). ఈ సినిమాకు వరుస సక్సెస్‌లతో తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్‌తో సందడి చేయబోతున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.

చిరంజీవి కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో భారీగా తారాగణం, పాపులర్ టెక్నిషియన్స్ వర్క్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రోమోషనల్ ఖర్చులతో కలిపి 225 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ నార్త్ అమెరికాలో మొదలయ్యాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఎలా ఉంది? ఏ రేంజ్‌లో ఓపెనింగ్స్ ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..
మన శంకర వరప్రసాద్ గారు సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను 20 రోజుల ముందుగానే నార్త్ అమెరికాలో ప్రారంభించారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు మెగా అభిమానులు సానుకూలంగా స్పందించడంతో బాక్సాఫీస్ జర్నీ పాజిటివ్‌గా మొదలైంది. ఈ సినిమా ప్రీమియర్లను జనవరి 11వ తేదీన గ్రాండ్‌గా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతన్నాయి. దాంతో చిరంజీవి అభిమానులు ఉత్సాహంగా తమ టికెట్లను ముందే రిజర్వు చేసుకొంటున్నారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నారు.
నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్లకు ఇప్పటి వరకు భారీగానే కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఇంకా 15 రోజులు ఉండగానే టికెట్ల అమ్మకాలు జోరందుకొన్నాయి. ఈ సినిమాను సుమారుగా 120 లోకేషన్లలో 400 షోలను ప్రదర్శించేందుకు డిస్ట్రిబ్యూటర్స్స సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటి వరకు 2500 నుంచి 3000 టికెట్లు అమ్ముడుపోయాయి. సుమారుగా 75 వేల అమెరికన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో సుమారుగా 70 లక్షల రూపాయలు వసూలు అయ్యాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి.. చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన పాటను విజయవాడ, గుంటూరు ప్రాంతంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. డిసెంబర్ 30వ తేదీన ఉదయం విజయవాడలో, మధ్యాహ్నం గుంటూరులో ఈ పాటను ప్రదర్శిస్తారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











