MSVG North America Box Office Collections: మన శంకర వరప్రసాద్ గారు యూఎస్ బాక్సాఫీస్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ ఎంటర్‌టైనర్ మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasadgaru). తన కెరీర్‌లో 157వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు వరుస సక్సెస్‌లతో తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్‌తో సందడి చేయబోతున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమాలో చిరంజీవి, వెంకీ కాంబినేషన్ స్పెషల్ ఎట్రాక్షన్ కావడంతో భారీగా బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన నార్త్ అమెరికా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి పండుగ సీజన్‌లో చిరంజీవి మూవీ వస్తుండటంతో ట్రేడ్ సర్కిల్‌లో భారీగానే అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా నార్త్ అమెరికా బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకొన్నారు. ఈ సినిమా అమెరికా, కెనడాలో డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి రావాలంటే కనీసం 5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అనుకొన్న వేగంగా జరగకపోగా.. కాస్త నెమ్మదిగానే మొదలైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో వైవిధ్యం ఉండటం, అలాగే ప్రీ రిలీజ్ తర్వాత చిరంజీవి వింటేజ్ సాంగ్‌కు అనూహ్యమైన రెస్సాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకొన్నది. ఈ సినిమా 1 మిలియన్ డాలర్ క్లబ్ వైపు అడుగులేస్తున్నది.
నార్త్ అమెరికాలో సుమారుగా 500 లోకేషన్లలో రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా కోసం దాదాపు 1600 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ సినిమా 25 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా 500000 డాలర్లకుపైగా కలెక్షన్లు అంటే భారతీయ కరెన్సీలో 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా రెండు రోజులు సమయం ఉండటం వల్ల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











