MSVG North America Box Office: అమెరికాలో మన శంకర వరప్రసాద్ బాక్సాఫీస్ సెన్సేషన్ .. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

Mana Shankara Vara Prasad Garu Collections: 2026 సంక్రాంతికి మోస్ట్ అవైటెడ్ మూవీ మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది చిరంజీవి కెరీర్‌లో 157వ సినిమా కావడం, అలాగే వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడం ఈ సినిమాపై మొదటి నుంచే భారీ క్రేజ్‌ను తీసుకొచ్చాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, రిలీజ్‌కు ముందే బిజినెస్ పరంగా, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సాలిడ్ నంబర్స్ నమోదు చేసింది. ప్రీమియర్‌లకు ముందే నార్డ్ అమెరికాలో 'మన శంకర వర ప్రసాద్ గారు' అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.

చిరంజీవి ' మన శంకర వర ప్రసాద్ గారు సినిమాను సుస్మిత కొనిదెలా, ప్రముఖ నిర్మాత సాహు గారపాటి కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మించారు. చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటించగా, విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, భీమ్స్ సిసిరిలియో సంగీతం ఈ సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి.

Mana Shankara Vara Prasad Garu Collections

బిజినెస్ పరంగా చూస్తే, ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే భారీ స్థాయిలో థియేట్రికల్ డీల్స్ కుదిరాయి. ఆంధ్రప్రదేశ్‌లో థియేట్రికల్ హక్కులు సుమారు 55 కోట్ల రూపాయలకు, నైజాం హక్కులు 32 కోట్ల రూపాయలకు, సీడెడ్ ఏరియా రైట్స్ 18 కోట్ల రూపాయల మేర ట్రేడ్ అయినట్లు సమాచారం. ఈ లెక్కన ఏపీ-తెలంగాణ కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 105 కోట్ల రూపాయల బిజినెస్ నమోదైంది. కర్ణాటకలో 10 కోట్ల రూపాయల మేర, ఇతర రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయల మేర డీల్స్ కుదరడంతో, ఇండియా మొత్తంగా ఈ సినిమాకు సుమారు 120 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మన శంకర వరప్రసాద్ గారు భారీ స్థాయిలో ట్రేడ్ అయింది. నార్త్ అమెరికా థియేట్రికల్ హక్కులు సుమారు 20 కోట్ల రూపాయల మేరకు అమ్ముడవ్వడంతో, వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల రూపాయల మధ్య జరిగినట్లు బిజినెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. భారీ స్థాయిలో బిజినెస్ జరిగిన నేపథ్యంలో, సినిమా పూర్తిస్థాయిలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.250-280 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. దీని బట్టి చూస్తే.. మెగాస్టార్ చిరంజీవి క్రేజ్, పవర్ ఎంటో అర్థమవుతోంది. అలాగే.. అనిల్ రావిపూడి టేకింగ్ పవర్ కూడా అర్థం చేసుకోసుకోవచ్చు.

ఇక అమెరికాలో జనవరి 11 రాత్రి నిర్వహించిన ప్రీమియర్స్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' అమెరికా సత్తా చాటుతున్నాడు. యూఎస్ వ్యాప్తంగా చాలా చోట్ల షోలు హౌస్‌ఫుల్‌గా నడవగా, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ సినిమాకు కలిసొచ్చింది. ఫలితంగా ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా 1.25 మిలియన్‌ డాలర్స్‌ గ్రాస్ మార్క్‌ను దాటింది. దీంతో చిరంజీవి కెరీర్‌లో అమెరికాలో మిలియన్ డాలర్ ప్రీమియర్ గ్రాస్ సాధించిన రెండో చిత్రంగా మన శంకర వరప్రసాద్ గారు నిలిచింది. గతంలో 'సైరా' మూవీకి 1 మిలియన్‌ డాలర్స్‌ సాధించిన ఘనత దక్కించుకుంది. ఇప్పుడు మరోసారి ఓవర్సీస్ లో చిరంజీవి సత్తా చాటుకున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కూడా సినిమా దూసుకుపోతోంది. ఏపీలో మొదటి నుంచే భారీగా టికెట్లు అమ్ముడవ్వగా, తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అంశం కారణంగా కొంత ఆలస్యంగా బుకింగ్స్ మొదలైనా, తర్వాత వేగం పెరిగింది. శనివారం రాత్రి వరకు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 10 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందులో హైదరాబాద్ ఒక్క నగరంలోనే దాదాపు 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్టు టాక్.

ఈ ట్రెండ్స్‌ను బట్టి చూస్తే, ప్రీమియర్స్‌తో పాటు తొలి రోజు కలిపి ఈ సినిమా సుమారు 50 నుంచి 55 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక సూపర్ హిట్ రావడంతో ఈ రేంజ్ మరింత పెరిగే అవకాశాలు కూడా లేకపోలేవని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా మన శంకర వరప్రసాద్ గారు బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్, ఓవర్సీస్ ప్రీమియర్స్ అన్ని కలిపి చూస్తే, మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా మారబోతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X