MSVPG Business: మన శంకర వరప్రసాద్ గారు వరల్డ్‌వైడ్ బిజినెస్ ఎన్ని కోట్లు.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 157వ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasadgaru). ఈ సినిమాకు వరుస సక్సెస్‌లతో తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్‌తో సందడి చేయబోతున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.
మీడియాలోను, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం.. చిరంజీవి కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో భారీగా తారాగణం, పాపులర్ టెక్నిషియన్స్ వర్క్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రోమోషనల్ ఖర్చులతో కలిపి 225 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఆంధ్రా థియేట్రికల్ హక్కులు 55 కోట్ల రూపాయలు, నైజాం హక్కులు 32 కోట్ల రూపాయలు, సీడెడ్ రైట్స్ 18 కోట్ల రూపాయల మేర వాల్యూ జరిగింది. కృష్ణా జిల్లా 8.2 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్ర 15.3 కోట్లు, గుంటూరు జిల్లాల 9 కోట్ల మేర రైట్స్ అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 210 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక తెలుగేతర రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. కర్ణాటక హక్కులు 10 కోట్ల మేర, ఇతర రాష్ట్రాల రైట్స్ 5 కోట్ల మేర జరిగింది. దాంతో ఇండియా రైట్స్ సుమారుగా 120 కోట్ల మేర వాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 240 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.
ఇక ఓవర్సీస్ రైట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయల మేర ట్రేడ్ జరిగింది. ఈ సినిమా అమెరికా, కెనడాలో డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి రావాలంటే కనీసం 5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 260 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ ట్రేడ్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 450 నుంచి 500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అనే ప్రచారం ట్రేడ్ వర్గాల్లో కొనసాగుతున్నది. ఈ బిజినెస్ వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
చిరంజీవి కెరీర్‌లోనే మన శంకర వరప్రసాద్ గారు సినిమా అత్యధికంగా బిజినెస్ జరిగింది. శాటిలైట్ రైట్స్ 50 కోట్ల మేర అమ్ముడుపోయాయి. ఓటీటీకి ఫ్యాన్సీ రేటు వచ్చింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు ఏ మేరకు లాభాలను పంచిపెడుతుందో వేచి చూడాల్సిందే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











