MSVPG AP Nizam 10 Days Box Office: శంకర వరప్రసాద్‌ కలెక్షన్ల సంచలనం.. నైజాం, ఆంధ్రాలో లాభం ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి, సెన్సిబుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన మన శంకర వరప్రసాద్ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నది. నయనతార హీరోయిన్‌గా, వెంకటేష్ అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. జనవరి 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం విడుదలైన అన్నీ చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు పంచి పెడుతున్నది. ఈ సినిమా 10 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఇండియా వైడ్ మన శంకర వరప్రసాద్ సినిమా ప్రీమియర్ల ద్వారా 9.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజు 35 కోట్ల రూపాయలు, రెండో రోజు 19.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 20 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 21.5 కోట్ల రూపాయలు, ఐదో రోజు 20.75 కోట్ల రూపాయలు, ఆరో రోజు 19.5 కోట్ల రూపాయలు, ఏడో రోజు 18 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజు 8.75 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజు 6.25 కోట్ల రూపాయలు, పదో రోజు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియా వైడ్ 180 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది అని సాక్ నిక్ వెల్లడించింది.

Mana Shankara Varaprasad Garu 10 days Box Office Collections

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 10 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 41.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 20 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 18.5 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 14 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 కోట్ల రూపాయలు, గుంటూరులో 10.5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 10 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో చేసిన బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నైజాం థియేట్రికల్ రైట్స్ 31 కోట్లు, సీడెడ్ 18 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 14 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7.2 కోట్ల రూపాయలు, గుంటూరులో 9 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 7.25 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 4.25 కోట్ల రూపాయలు మేర బిజినెస్ చేసింది.

ఇదిలా ఉండగా, చిరంజీవి నటించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. విడుదలైన అన్ని జిల్లాలు, ఏరియాలో లాభాల జోన్‌లోకి వెళ్లింది. ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాల్లో ప్రాఫిట్ సాధించిన అతికొద్ది సినిమాల్లో మన శంకర వరప్రసాద్ ఒకటి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నైజాం ఏరియాలో సొంతంగా రిలీజ్ చేసుకొన్న నిర్మాత సాహు గారపాటికి భారీ లాభాలను తెచ్చిపెడుతుందని అంచనా వేస్తున్నారు. రెండో వారంలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా వసూళ్లను సాధిస్తున్నది. టికెట్ రేట్లు తగ్గించిన క్రమంలో వారాంతపు సెలవుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X