MSVPG Karnataka Box Office: కర్ణాటకలో శంకర వరప్రసాద్ కలెక్షన్ల ప్రభంజనం..ఎన్టీఆర్,అల్లు అర్జున్‌కు ధీటుగా చిరు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఇప్పటికే 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో రీజనల్ కేటగిరీలో సరికొత్త రికార్డులు నెలకొల్పారు చిరంజీవి. విడుదలై రెండు వారాలు కావొస్తున్నా ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో మెగాస్టార్ ప్రభంజనం సృష్టిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌, కర్ణాటకలలో మన శంకర వరప్రసాద్ గారు మూవీ రికార్డ్ వసూళ్లు సాధిస్తోంది. తాజాగా కన్నడ నాట చిరంజీవి ఓ అరుదైన ఘనతను సాధించారు. ఈ వివరాల్లోకి వెళితే..

మన శంకర వరప్రసాద్ గారు తారాగణం
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. చిరంజీవి సరసన లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించారు. టాలీవుడ్ అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో మెరిశారు. వీరితో పాటు కేథరిన్ థ్రెసా, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్‌, శరత్ సక్సేనా, సచిన్ ఖేడేకర్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహించారు, తమ్మిరాజు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

Mana Shankara Varaprasad Garu 14 Days Karnataka Box Office Collections Chiranjeevi Film crossed 20 Cr Gross mark

మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత?
సాంకేతిక నిపుణులు, నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రోడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి మన శంకర వరప్రసాద్ గారు మూవీని దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు రూ.105 కోట్లకు అమ్ముడవ్వగా... ఇండియా వైడ్‌గా బిజినెస్ సుమారు రూ.120 కోట్లకు క్లోజ్ అయ్యాయి. ఓవర్సీస్‌లో రూ.20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాంతో మొత్తం కలిపి చిరంజీవి మూవీకి వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. దాంతో మన శంకర వరప్రసాద్ గారు మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

తొలి నుంచి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలకు కర్ణాటకలో మంచి మార్కెట్ ఉంది. బళ్లారి నుంచి బెంగళూరు వరకు ఆయన సినిమాలకు రికార్డ్‌లు బద్ధలయ్యాయి. కెరీర్ తొలినాళ్ల నుంచి తెలుగు రాష్ట్రాలతో సమానంగా కర్ణాటకలోనూ చిరు సినిమాలు రిలీజై మంచి వసూళ్లు సాధించేవి. తాజాగా ఈ సంక్రాంతికి విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు మూవీ కర్ణాటకలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు చిరంజీవి మూవీ అక్కడ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే...

మన శంకర వరప్రసాద్ గారు కర్ణాటక కలెక్షన్స్
చిరంజీవి క్రేజ్, అనిల్ రావిపూడి క్రేజ్ కారణంగా మన శంకర వరప్రసాద్ గారు మూవీకి కన్నడ థియేట్రికల్ రైట్స్ 8 కోట్ల రూపాయలు పలికాయి. దాంతో ఈ సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. అడ్వాన్స్ బుకింగ్‌లోనే దుమ్ములేపిన చిరు సినిమా ప్రీమియర్స్‌లో 1.3 కోట్ల రూపాయలు, తొలిరోజున 2.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.93 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.05 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3.5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.7 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.1 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2.1 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 55 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 35 లక్షల రూపాయలు, పదో రోజున 30 లక్షల రూపాయలు, పదకొండో రోజున 30 లక్షల రూపాయలు, పన్నెండో రోజున 20 లక్షల రూపాయలు, పదమూడో రోజున 20 లక్షల రూపాయలు చొప్పున మొత్తంగా కర్ణాటకలో 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

మన శంకర వరప్రసాద్ గారుతో చిరంజీవి రికార్డ్
తన సినిమాలకు కర్ణాటకలో 20 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడం చిరంజీవికి ఇది మూడోసారి. తద్వారా ఇప్పటికే మూడేసి సార్లు ఈ ఘనతను అందుకున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో చిరంజీవి సమానంగా నిలిచారు. అటు కర్ణాటకలో అత్యధికసార్లు 20 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన హీరోలుగా సూపర్‌స్టార్ రజనీకాంత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచారు. వీరిద్దరూ చెరో 6 సార్లు ఈ ఘనతను సాధిండం విశేషం.

మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్
ఇక మన శంకర వరప్రసాద్ గారు ఓవరాల్ కలెక్షన్స్ విషయానికి వస్తే... ఇండియాలో 186.05 కోట్ల రూపాయల నెట్, 220.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ చొప్పున రాబట్టినట్లు సాక్‌నిక్ నివేదించింది. అటు ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 4.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 41.5 కోట్ల రూపాయలు) రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 300 కోట్ల రూపాయల మార్క్ చేరుకున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తద్వారా రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం అరుదైన రికార్డులు సృష్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X