MSVPG 20 Days Andhra, Nizam Box Office: శంకర వరప్రసాద్ కలెక్షన్ల సునామీ.. చిరంజీవి మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతూ భారీగా కలెక్షన్లను సాధిస్తున్నది. షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం రికార్డు వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రం గత రెండు వారాల్లో ఊహించిన కలెక్షన్లు సాధించి డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతున్నది.

సంక్రాంతి బరిలో దూకిన ఈ చిత్రం తొలి ఆట నుంచి ఎదురులేని, తిరుగులేని సత్తాను బాక్సాఫీస్ వద్ద చాటింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, ఓవర్సీస్‌లో సంచలన వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 2026 ఆరంభంలోనే సౌత్‌లో ఇండస్ట్రీ హిట్‌ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమా అన్ని ఏరియాలో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు భారీ లాభాలను పంచిపెట్టడం విశేషంగా మారింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Mana Shankara Varaprasad Garu 20 Days Collections

మన శంకర వరప్రసాద్ గారు తొలి వారం రికార్డు స్థాయిలో బాక్సాఫీస్‌ను కుమ్మేసింది. మొదటి వారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 187 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారంలో కూడా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. రెండో వారంలో 24 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రెండు వారాల్లో 210 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లను రాబట్టింది. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

ఇక మూడో వారంలో కూడా ఈ సినిమా స్టడీగా వసూళ్లను సాధిస్తున్నది. ప్రతీ రోజు కోటి రూపాయలకుపైగా కలెక్షన్లను నమోదు చేస్తున్నది. మూడో శుక్రవారం ఈ సినిమా 1.5 కోట్ల రూపాయలు, శనివారం అంటే 20వ రోజు 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వారాంతంలో ఈ సినిమా బెటర్‌గా నిలకడగా వసూళ్లను సాధిస్తుండటంతో మరో వారం ఈ సినిమా ఆంధ్రా, నైజాం బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత 20 రోజుల్లో శంకర వరప్రసాద్ చిత్రం ఆంధ్రా, నైజాంలో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం నైజాంలో 45.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సీడెడ్‌లో 23 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 22 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 15.5 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 10 కోట్ల రూపాయలు, గుంటూరులో 11 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 11 కోట్ల రూపాయలు, నెల్లూరులో 6.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతోఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 218 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మన శంకర వరప్రసాద్ గారు చిత్రం భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో కలిపి మొత్తంగా 120 కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ నమోదు చేసింది. సుమారుగా 122 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో జర్నీని మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ చిత్రం 55 కోట్లకుపైగా లాభాలను పంచి పెట్టింది అని ట్రేడ్ పండితులు వెల్లడిస్తున్నారు. ఓ రీజినల్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడం ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X