MSVPG AP Nizam BoxOffice: శంకర వరప్రసాద్ ఏపీ, నైజాం కలెక్షన్ల సంచలనం.. అల్లు అర్జున్ రికార్డు చిరంజీవి బ్రేక్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 157వ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasadgaru). ఈ సినిమాకు వరుస సక్సెస్‌లతో తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మించారు.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్‌తో సందడి చేయబోతున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సృష్టిస్తున్న కలెక్షన్ల ప్రభంజనం వివరాల్లోకి వెళితే..

శంకర వరప్రసాద్ బడ్జెట్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రోమోషనల్ ఖర్చులతో కలిపి 225 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఆంధ్రా థియేట్రికల్ హక్కులు 55 కోట్ల రూపాయలు, నైజాం హక్కులు 32 కోట్ల రూపాయలు, సీడెడ్ రైట్స్ 18 కోట్ల రూపాయల మేర వాల్యూ జరిగింది.
ఏపీ, తెలంగాణలో బిజినెస్
ఏరియాల వారీగా ఈ మూవీ బిజినెస్ విషయానికి వస్తే.. కృష్ణా జిల్లా 8.2 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్ర 15.3 కోట్లు, గుంటూరు జిల్లాల 9 కోట్ల మేర రైట్స్ అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 210 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
6 రోజుల కలెక్షన్లు
మన శంకర వరప్రసాద్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నది. ఈ చిత్రం ఏపీ, నైజాంలో ప్రీమియర్ల ద్వారా 4.90 నెట్, 9.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తొలి రోజున 35 కోట్ల రూపాయల గ్రాస్, 27.5 కోట్ల నెట్, రెండో రోజున 20 కోట్ల రూపాయల గ్రాస్, 12.4 కోట్ల నెట్, మూడో రోజున 20 కోట్ల రూపాయల గ్రాస్, 13.24 కోట్ల నెట్, నాలుగో రోజున 22 కోట్ల రూపాయల గ్రాస్, 15.53 కోట్ల నెట్, ఐదో రోజున 21 కోట్ల రూపాయల గ్రాస్, 14.56 కోట్ల నెట్, ఆరో రోజున 20 కోట్ల రూపాయల గ్రాస్ 14 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 102 కోట్లకుపైగా నెట్ వసూళ్లను రాబట్టింది.
ఆంధ్రా, నైజాంలో ఏరియాల వారీగా
గత ఆరు రోజుల్లో చిరంజీవి నటించిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ ఏరియాలోను రికార్డులను తిరగరాసింది. నైజాంలో 34.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 13.5 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 10.2 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 8.5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 8 కోట్ల రూపాయలు, నెల్లూరులో 5 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
7వ రోజు ఎన్ని కోట్లంటే?
ఇక ఈ చిత్రం 7వ రోజున కూడా రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది. ఇండియా వైడ్ ఈ చిత్రం 17.5 కోట్ల నెట్ వసూళ్లను, 25 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 15 కోట్లకుపైగా నెట్ వసూళ్లను నమోదు చేసిందని తెలిపారు. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 116 కోట్లకు రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.
చిరంజీవి మూవీ ఆల్ టైమ్ రికార్డు
థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే.. మన శంకర వరప్రసాద్ చిత్రం దాదాపు అన్ని ప్రాంతాల్లోను బ్రేక్ ఈవెన్ సాధించింది. ఏపీ, నైజాంతో కలి దాదాపు 7 ఏరియాల్లో లాభాల జోన్‌లోకి ప్రవేశించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డు దిశగా పరుగులు పెడుతున్నది. ఈ చిత్రం అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా ఏడు రోజుల రికార్డును అధిగమించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ఇప్పటికే చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 292 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది అని షైన్ స్క్రీన్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది.


Click it and Unblock the Notifications











