MSVPG 8 days Karnataka Box Office: కన్నడలో శంకర ప్రసాద్ రికార్డు కలెక్షన్లు.. చిరు మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

మెగాస్టార్ చిరంజీవి, సెన్సిబుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన మన శంకర వరప్రసాద్ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నది. నయనతార హీరోయిన్‌గా, వెంకటేష్ అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. జనవరి 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం విడుదలైన అన్నీ చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు పంచి పెడుతున్నది.

ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలకు, నార్త్ అమెరికాకే పరిమితం కాలేదు. ఈ చిత్రం పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రం ఈ ఏడాదిలో కన్నడ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత ఎనిమిది రోజులుగా ఈ సినిమా కర్ణాటక బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Mana Shankara Varaprasad Garu 8 Days Karnataka Box Office

మన శంకర వరప్రసాద్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెరగడంతో ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ కర్ణాటకలో భారీగా జరిగింది. ఈ చిత్రానికి 8 కోట్లు చెల్లించి కన్నడ థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకొన్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 16 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన పరిస్థితుల్లో బాక్సాఫీస్ జర్నీని చేపట్టింది.

మన శంకర వరప్రసాద్‌ మూవీకి రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్ క్రేజీగా జరిగింది. ఈ సినిమా ప్రీమియర్లకు అనూహ్యమైన స్పందన కనిపించింది. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 1.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదే ఊపును బాక్సాఫీస్ వద్ద కొనసాగిస్తున్నది. బెంగళూరు, బళ్లారి, ఇతర ప్రాంతాల్లో భారీగా వసూళ్లను రాబడుతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఆ తర్వాత కన్నడలో ఈ చిత్రం రికార్డు వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజు 2.85 కోట్ల రూపాయలు, రెండో రోజు 1.95 కోట్ల రూపాయలు, మూడో రోజు 2 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 3.5 కోట్ల రూపాయలు, ఐదో రోజు 1.7 కోట్ల రూపాయలు, ఆరో రోజు 2 కోట్లు, ఏడో రోజు 2.25 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఎనిమిది రోజుల్లో 19 కోట్ల రూపాయల మేర రికార్డు వసూళ్లను రాబట్టింది.

కన్నడ చిత్ర రంగం ఇటీవల కాలంలో సరైన సినిమాలు లేకపోవడం వల్ల పరిస్థితి దారుణంగా మారింది. తెలుగు సినిమాలు చేస్తున్న హంగామా వల్ల థియేటర్ల యాజమాన్యానికి జోష్ కలిగించింది. కన్నడ రాష్ట్రంలోని తెలుగు ప్రేక్షకులకు ఈ సంక్రాంతి సినిమాలు కొత్త అనుభూతిని పంచాయి అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X