MSVPG Closing Collections: మన శంకర వరప్రసాద్ క్లోజింగ్ కలెక్షన్లు.. చిరంజీవి మూవీకి లాభం ఎన్ని కోట్లంటే?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2026 సంవత్సరంలో రికార్డు స్థాయిలో కలెక్షన్ల పంట పండించిన చిత్రం మన శంకర వరప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నయనతారతో కలిసి నటించిన ఈ మూవీని షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? థియేట్రికల్ రన్‌లో సాధించిన కలెక్షన్లు ఎంత? ఈ మూవీకి ఎంత లాభం వచ్చిందనే వివరాల్లోకి వెళితే..
చిరంజీవి వింటేజ్ మార్క్ చిత్రంగా అవుట్ అవుట్ కామెడీ, యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని సుమారుగా 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రోమోషనల్ ఖర్చులతో 250 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు భారీ స్పందన రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమాను నిర్మాత సాహు గారపాటి నైజాంలో సొంతంగా కమిషన్ బేస్ మీద రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాను నైజాంలో 31 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. ఇక సీడెడ్ బిజినెస్ 18 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్ర 14 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లా రైట్స్ 9.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లా 9 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లా 4.25 కోట్ల రూపాయల మేర బిజినెస్ వాల్యూ కట్టారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 100 కోట్ల మేర బిజినెస్ చేసింది.
ఇక ఈ సినిమా కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 8.5 కోట్ల మేర అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ రైట్స్ 12 కోట్లు అని ట్రేడ్ వర్గాల వెల్లడించాయి. ఈ మూవీ రిలీజ్‌కు ముందే సుమారుగా 120 కోట్ల రూపాయల బిజినెస్‌ను వాల్యూ చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 125 కోట్ల రూపాయబ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.
మన శంకర వరప్రసాద్ సినిమాను ఒక రోజు ముందే ప్రీమియర్లు ప్రదర్శించగా బ్రహ్మండమైన టాక్ వచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజు భారీగా అంటే 30 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఈ చిత్రం అత్యధిక వసూళ్లతో బాక్సాఫీస్‌ను కనకవర్షంతో తడిపేసింది.
తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో ఈ చిత్రం సుమారుగా 50 కోట్ల మేర వసూళ్లను సాధించింది. సీడెడ్‌లో 25 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రలో 24 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 17 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కోట్ల రూపాయలు, గుంటూరులో 13 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 12 కోట్లు, నెల్లూరులో 7.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో 160 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లను రాబట్టింది. కర్ణాటకలో ఈ సినిమా 20 కోట్లకుపైగా కలెక్షన్లను, తమిళనాడులో 3 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 5 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఇండియాలో 190 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది.
ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా 235 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా సుమారుగా 400 కోట్లకు చేరువగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా దాదాపు 80 కోట్లకుపైగా లాభాలను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











