MSVPG Karnataka Collections: కర్ణాటకలో శంకర వరప్రసాద్ బాక్సాఫీస్ జోరు.. చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ చిత్రం విడుదలైన ప్రతీ చోట రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది. దర్శకుడు అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాలకు చేరువ కావడం తెలిసిందే. దాంతో ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోవడంతో అన్ని చోట్ల ప్రభంజనం కొనసాగుతున్నది. అయితే కర్ణాటకలో ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలో చిరంజీవి సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంది. బళ్లారి, ఇతర ప్రాంతాల్లో ఆయన నటించిన చిత్రాలు రికార్డు వసూళ్లను సాధించాయి. అయితే మన శంకర వరప్రసాద్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెరగడంతో ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ చిత్రానికి 8 కోట్లు చెల్లించి థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకొన్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 16 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మన శంకరవరప్రసాద్ సినిమా రిలీజ్ తర్వాత కన్నడవాసులు నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అన్నివర్గాలను మెప్పించడంతో కాసుల వర్షం కురుస్తున్నది. ఈ సినిమా త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా భారీ లాభాలను సొంతం చేసుకొంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కన్నడలో మెగాస్టార్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ ప్రీమియర్ల ద్వారా 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక తొలి రోజు ఈ సినిమా 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 2 కోట్ల రూపాయలు, మూడో రోజు 2.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 2 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా నాలుగు రోజుల్లో 10 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఐదో రోజు మాత్రం తొలి రోజు కంటే ఎక్కువగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా సుమారుగా 3 కోట్లకుపైగా వసూళ్లను రాబడుతుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మన శంకర వరప్రసాద్ గారు మూవీ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ ఎంటర్‌టైనర్. తన కెరీర్‌లో 157వ చిత్రంగా రూపొందింది. ఈ సినిమాకు వరుస సక్సెస్‌లతో తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మించారు.
చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటించారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్‌తో సందడి చేశారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో వ్యవహరించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్లు జనవరి 11వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











