MSVPG Nizam Box Office: నైజాంలో శంకర వరప్రసాద్ సరికొత్త చరిత్ర.. చిరంజీవి మూవీకి రేర్ రికార్డు ఏమిటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రఫాడిస్తున్నది. ఈ చిత్రం మూడో వారంలోకి ప్రవేశించిన గానీ వసూళ్ల దూకుడు తగ్గించలేదు. విడుదలైన ప్రతీ చోట ఈ సినిమా రికార్డు కలెక్షన్లను కురిపించడమే కాకుండా భారీ లాభాలను డిస్టిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు పంచి పెడుతున్నది. అయితే తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని విధంగా కలెక్షన్లు రాబడుతూ సంచలనాలు క్రియేట్ చేస్తున్నది. అయితే ఈ సినిమా నైజాంలో ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఆ మెగా రికార్డు వివరాల్లోకి వెళితే..

మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో తొలి వారం 190 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది. రెండో వారంలో 25 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఆంధ్రా, నైజాంలో 215 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను సాధించింది.

Mana Shankara Varaprasad Garu

చిరంజీవి నటించిన సినిమాలు వసూళ్లను రాబట్టడంలో నైజాం అడ్డగా చెప్పుకొంటారు. ఈ సినిమా కూడా భారీగా వసూళ్లను కలెక్ట్ చేసి మెగాస్టార్‌కు ఈ ప్రాంతంలో తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఈ సినిమా నైజాంలో 45 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 40 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని వెల్లడించారు.

అయితే మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నైజాంలో మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది అని షైన్ స్క్రీన్ బ్యానర్ వెల్లడించింది. తాజా ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు పెట్టి సంచలన వార్తను అందించారు. మెగాస్టార్ ర్యాంపే్ ప్రతీ ప్రాంతంలో కొనసాగుతున్నది. నైజాంలో ఈ సినిమా 30 లక్షలకుపైగా ఆడియెన్స్ వీక్షించారు. 3 మిలియన్ల మేర ఫుట్‌పాల్స్ నమోదు అయ్యాయి.

ఈ సినిమా మూడో వారంలోకి ప్రవేశించడంతోపాటు ఇంకా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్నది. ప్రాంతీయ సినిమాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డు అని వెల్లడించారు. ఈ సినిమా ఇప్పటి వరకు 380 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం త్వరలోనే 400 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరుతుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి, సెన్సిబుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన మన శంకర వరప్రసాద్ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నది. నయనతార హీరోయిన్‌గా, వెంకటేష్ అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X