MSVPG Day 1 Box Office Collections: మన శంకర వరప్రసాద్‌కు రికార్డు ఓపెనింగ్స్.. చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజై పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్‌కు భారీ స్పందన రావడంతో అడ్వాన్స్ బుకింగ్‌‌కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. యువ నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమిటి? ఈ సినిమా కలెక్షన్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకొని నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. యాక్టర్లు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ వ్యయంతో కలిపి ఈ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌ అందర్నీ ఆకట్టుకోవడంతో ట్రేడ్ వర్గాల్లో అంచనాలను పెంచింది. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్లు, ఇండియా వైడ్ 120 కోట్లు, వరల్డ్ వైడ్ ఈ సినిమా 150 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అని ట్రేడ్ వర్గాల్లో ప్రచారమైంది.

Mana Shankara Varaprasad Garu Day 1 Expected Box Office

జనవరి 11వ తేదీన రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్లకు భారీ స్పందన కనిపించింది. ప్రీమియర్లకు రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదు అయ్యాయి. తొలి ఆట తర్వాత ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. దాంతో ఈ మూవీ తొలి రోజు కూడా భారీగా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఇక వరల్డ్ వైడ్ ప్రీమియర్ల వసూళ్ల విషయానికి వస్తే.. నైజాంలో ఈ సినిమా సుమారుగా 4 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 7 కోట్లకుపైగా కలెక్షన్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 1.2 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ ప్రీమియర్ల ద్వారా 24.5 కోట్ల నుంచి 25.5 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను సాధించింది.

ఇక ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఏపీ, నైజాంలో కలిపి 50 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 8 నుంచి 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 17 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతొ ఈ సినిమా 75 నుంచి 80 కోట్ల రూపాయల వసూలు చేయవచ్చని పేర్కొంటున్నారు. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మరింతగా కలెక్షన్లు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్‌తో సందడి చేయబోతున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X