MSVPG Day 1 Collections: మన శంకర వరప్రసాద్ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి? చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ ఎంటర్‌టైనర్ మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). తన కెరీర్‌లో 157వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు వరుస సక్సెస్‌లతో తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్‌తో సందడి చేయబోతున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీమియర్లు, తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.

ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఆంధ్రా థియేట్రికల్ హక్కులు 55 కోట్ల రూపాయలు, నైజాం హక్కులు 32 కోట్ల రూపాయలు, సీడెడ్ రైట్స్ 18 కోట్ల రూపాయల మేర వాల్యూ జరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. కర్ణాటక హక్కులు 10 కోట్ల మేర, ఇతర రాష్ట్రాల రైట్స్ 5 కోట్ల మేర జరిగింది. దాంతో ఇండియా రైట్స్ సుమారుగా 120 కోట్ల మేర వాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఓవర్సీస్ రైట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయల మేర ట్రేడ్ జరిగింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల రూపాయల మేర జరిగిందనే టాక్ బిజినెస్ వర్గాల్లో ఉంది.
అయితే ఏపీలో ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ భారీగా నమోదు అవుతున్నాయి. టికెట్ రేట్ల పెంపు వ్యవహారం కారణంగా తెలంగాణలో కాస్త ఆలస్యంగానే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైనప్పటికీ.. కలెక్షన్ల పరంగా ఊపందుకొన్నది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో శనివారం రాత్రి వరకు 10 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. హైదరాబాద్‌లోనే సుమారుగా 3 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ చిత్రానికి నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన, జోష్ కనిపిస్తున్నది. శనివారం రాత్రి వరకు ఈ సినిమా ప్రీమియర్ షోకు 900K డాలర్లు వసూలు చేసింది. ప్రీమియర్ల తర్వాత 1 మిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్లను రాబడుతుంది. అమెరికా, కెనడాలో కలిపి ఈ సినిమా సుమారుగా 10 నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రీమియర్లు, తొలి రోజు కలిపి ఈ చిత్రం తక్కువలో తక్కువ 16 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది అని చెబుతున్నారు.
తాజా ట్రెండ్ బట్టి చూస్తే.. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం తొలి రోజు చిరంజీవి కెరీర్‌లో రికార్డు వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తున్నది. ఈ చిత్రం ప్రీమియర్లు, తొలి రోజు కలిపి సుమారుగా 50 నుంచి 55 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టే ఛాన్స్ కనిపిస్తుంది. పాజిటివ్ టాక్ వస్తే.. ఈ రేంజ్ ఇంకా భారీగా పెరిగే అవకాశం లేకపోలేదు అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











