MSVPG Day 19 Box Office Collections: బాక్సాఫీస్ వద్ద బాస్ జాతర... శంకర వరప్రసాద్ గారికి ఎన్ని కోట్ల లాభమంటే?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఇప్పటికే 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి చిరంజీవి కెరీర్‌లోనే తొలి 300 కోట్ల రూపాయల సినిమాగా నిలిచింది. మూడు వారాలు కావొస్తున్న శంకర వరప్రసాద్ గారు మూవీకి ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు. తాజాగా 19వ రోజు మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఇప్పటి వరకు ఎన్ని కోట్ల లాభాలు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే..

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో చిరంజీవి సరసన లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో అలరించారు. వీరితో పాటు కేథరిన్ థ్రెసా, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్‌లు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహించారు, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరించారు.

Mana Shankara Varaprasad Garu Day 19 Expected Box Office Collections Worldwide Chiranjeevi film yielding a return on investment

మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత?
సాంకేతిక నిపుణులు, నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రోడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి మన శంకర వరప్రసాద్ గారు మూవీని దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు రూ.105 కోట్లకు అమ్ముడవ్వగా... ఇండియా వైడ్‌గా బిజినెస్ సుమారు రూ.120 కోట్లకు క్లోజ్ అయ్యాయి. ఓవర్సీస్‌లో రూ.20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాంతో మొత్తం కలిపి చిరంజీవి మూవీకి వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. దాంతో మన శంకర వరప్రసాద్ గారు మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

మన శంకర వరప్రసాద్ గారు 18 రోజుల కలెక్షన్స్
మన శంకర వరప్రసాద్ గారు మూవీకి ప్రీమియర్స్‌లో 9.35 కోట్ల రూపాయలు, తొలి రోజున 32.25 కోట్ల రూపాయలు, 2వ రోజున 18.75 కోట్ల రూపాయలు, 3వ రోజున 19.5 కోట్ల రూపాయలు, 4వ రోజున 22 కోట్ల రూపాయలు, 5వ రోజున 19.5 కోట్ల రూపాయలు, 6వ రోజున 18.9 కోట్ల రూపాయలు, 7వ రోజున 17.65 కోట్ల రూపాయలు, 8వ రోజున 8 కోట్ల రూపాయలు, 9వ రోజున 5.75 కోట్ల రూపాయలు, పదో రోజున 4.2 కోట్ల రూపాయలు, 11వ రోజున 3.3 కోట్ల రూపాయలు, 12వ రోజున 2.65 కోట్ల రూపాయలు, 13వ రోజున 4.25 కోట్ల రూపాయలు, 14వ రోజున 6.2 కోట్ల రూపాయలు, 15వ రోజున 5 కోట్ల రూపాయలు, 16వ రోజున 2.1 కోట్ల రూపాయలు, 17వ రోజున 1.3 కోట్ల రూపాయలు, 18వ రోజున 1.09 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 201.74 కోట్ల రూపాయల నెట్... 237.85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

మన శంకర వరప్రసాద్ గారు ఓవర్సీస్ కలెక్షన్స్
భారత్‌తో సమానంగా ఓవర్సీస్‌లోనూ చిరంజీవి మూవీకి వసూళ్లు వస్తున్నాయి. నార్త్ అమెరికాలో బుధవారం వరకు మన శంకర వరప్రసాద్ గారు మూవీకి 3.33 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో 30.61 కోట్ల రూపాయలు) వసూలైంది. అయితే 18 రోజుల వరకు మొత్తంగా ఓవర్సీస్ మార్కెట్‌లో చిరంజీవి సినిమాకు 4.5 మిలియన్ డాలర్లు (దాదాపు 42 కోట్ల రూపాయలు) రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి మన శంకర వరప్రసాద్ గారు మూవీకి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 280 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. అయితే 15 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 358 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలూ చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటి వరకు కర్ణాటకలో 21.3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 209.45 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2.91 కోట్ల రూపాయలు, కేరళలలో 12 లక్షల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 4.07 కోట్ల రూపాయల నికర వసూళ్లు రాబట్టాడు మెగాస్టార్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 218 కోట్ల రూపాయల గ్రాస్... 143 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయగా.. వరల్డ్ వైడ్‌గా 280 కోట్ల రూపాయల గ్రాస్ 170 కోట్ల రూపాయల షేర్ రాబట్టాడు శంకర వరప్రసాద్ గారు. చిత్ర నిర్మాణ సంస్థ లెక్కలను బట్టి చూస్తే ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ఈవెన్ కాగా.. దాదాపు 60 కోట్ల రూపాయల లాభాలను అందించింది.

మన శంకర వరప్రసాద్ గారు 19వ రోజు కలెక్షన్స్
మన శంకర వరప్రసాద్ గారు మూవీకి సోమవారం ఉదయం, మాట్నీ షోలకు అంతంత మాత్రంగా బుకింగ్స్ జరగ్గా.. వీకెండ్ కావడంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు మాత్రం బుకింగ్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సినిమాకు 14 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ పేర్కొంది. కడపటి వార్తలు అందేసరికి మన శంకర వరప్రసాద్ గారికి ఇండియాలో 19వ రోజు 20 లక్షల రూపాయల నెట్ వసూలైనట్లు సాక్‌నిక్ తెలిపింది. 19వ రోజు చిరంజీవి మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 25 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 1.50 కోట్ల రూపాయలు వసూలు చేయొచ్చని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X