MSVPG Day 2 Box Office Collections: శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ కుమ్ముడు.. చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లంటే
Mana Shankara Vara Prasad Garu Collections: సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) . ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడిన ఈ సినిమా, పండుగ సీజన్‌కు తగ్గట్టుగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించబడింది. ఇక టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ (Venkatesh) గెస్ట్ రోల్‌లో కనిపించడం సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే...
ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణెదెలఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. రిలీజ్‌కు ముందే జనవరి 11న తెలుగు రాష్ట్రాలు, నార్త్ అమెరికా సహా పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు.

భారీ బడ్జెట్, భారీ థియేట్రికల్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, విస్తృత పబ్లిసిటీ ఖర్చులు కలిపి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా బడ్జెట్ భారీ స్థాయిలో ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే, ఆంధ్రా రైట్స్ రూ.55 కోట్లకు, నైజాం రైట్స్ రూ.32 కోట్లకు, సీడెడ్ రైట్స్ రూ.18 కోట్లకు క్లోజ్ అయ్యాయి. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా రూ.105 కోట్ల థియేట్రికల్ బిజినెస్ సాధించడం విశేషం. దీని ప్రకారం, ఆంధ్రా-నైజాం ప్రాంతాల్లో మాత్రమే సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.220 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది మెగాస్టార్ సినిమా కావడంతో సాధ్యమేనని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
వరల్డ్‌వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే
ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. కర్ణాటకలో రూ.10 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడవగా, ఇతర రాష్ట్రాల్లో కలిపి మరో రూ.5 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. దీంతో ఇండియా మొత్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.120 కోట్లకు చేరింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మెగాస్టార్ క్రేజ్ బలంగా పనిచేసింది. నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్‌ను దాదాపు రూ.20 కోట్లకు విక్రయించారు. ఈ లెక్కలన్నింటిని కలిపితే, 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.140 నుంచి రూ.150 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తి స్థాయిలో లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.280 నుంచి రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుందని బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ట్రేడ్ పండితులు నిర్దేశించారు.
కలెక్షన్స్ వివరాలు ఇలా..
మన శంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఆరంభాన్ని నమోదు చేసింది. ప్రీమియర్స్‌తో పాటు ఫస్ట్ డే కలిపి ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.84 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా 'మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ బద్దలు కొట్టేశారు' అంటూ చిత్ర నిర్మాణ సంస్థ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇది చిరంజీవి కెరీర్‌లో రెండో అతి పెద్ద ఓపెనింగ్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. కానీ, ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఇండియావ్యాప్తంగా ఫస్ట్ డే నెట్ కలెక్షన్స్ రూ.37.10 కోట్లుగా నమోదైనట్లు ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ 'సాక్నిల్క్' వెల్లడించింది. అంతేకాదు, వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్ల ద్వారానే దాదాపు రూ.25 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'మన శంకరవరప్రసాద్ గారు' సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఫస్ట్ డే మాత్రమే 1.7 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ప్రీమియర్లలోనే వన్ మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన చిరంజీవి రెండో చిత్రంగా ఇది నిలవడం విశేషం. ఇది మెగాస్టార్‌కు అక్కడున్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించింది. సినిమాకు వస్తున్న స్పందన కూడా కలెక్షన్లు పెరిగే అవకాశముంది. చిరంజీవి కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, పంచ్‌లకు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్, మూవీ లవర్స్ కూడా ఫిదా అవుతున్నారు. దీనికి తోడు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైనింగ్ టేకింగ్ సినిమాను మరింత ఎలివేట్ చేసిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇక రెండో రోజు కలెక్షన్ల అంచనాల విషయానికి వస్తే... తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం ఏపీ, నైజాంలో కలిపి రూ.25-30 కోట్ల వరకు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో రూ.5-6 కోట్లు, ఓవర్సీస్‌లో దాదాపు రూ.7 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కల ప్రకారం రెండో రోజు వరల్డ్ వైడ్‌గా రూ.40 నుంచి రూ.42 కోట్ల వరకు కలెక్షన్స్ రావచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి పాజిటివ్ టాక్, పండుగ సీజన్ అడ్వాంటేజ్, మెగాస్టార్ స్టామినా కలిసి 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్నారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే రోజుల్లో కలెక్షన్లు పెరిగే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











