MSVPG Day 22 Box Office Collections: శంకర వరప్రసాద్ గారికి షాకింగ్ కలెక్షన్స్.. చిరు మూవీకి ఎన్ని కోట్లంటే?
మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్‌స్టార్ నయనతార జంటగా నటించిన చిత్రం మన శంక వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించారు. టాలీవుడ్ అగ్రనటుడు విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. కేథరిన్ థ్రెసా, శరత్ సక్సేనా, సచిన్ ఖేడేకర్, జరీనా వహబ్, అభినవ్ గోమటం, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్‌లు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా .. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహించగా, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఇప్పటి వరకు 3 వారాలు పూర్తి చేసుకున్న శంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది? ఎన్ని కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత?
సాంకేతిక నిపుణులు, నటీనటుల రెమ్యునరేషన్, ప్రోడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి మన శంకర వరప్రసాద్ గారు మూవీని దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు రూ.105 కోట్లకు అమ్ముడవ్వగా... ఇండియా వైడ్‌గా బిజినెస్ సుమారు రూ.120 కోట్లకు క్లోజ్ అయ్యాయి. ఓవర్సీస్‌లో రూ.20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాంతో మొత్తం కలిపి చిరంజీవి మూవీకి వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. దాంతో మన శంకర వరప్రసాద్ గారు మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

మన శంకర వరప్రసాద్ గారు 21 రోజుల కలెక్షన్స్
మన శంకర వరప్రసాద్ గారు మూవీకి ప్రీమియర్స్‌లో 9.35 కోట్ల రూపాయలు, తొలి రోజున 32.25 కోట్ల రూపాయలు, 2వ రోజున 18.75 కోట్ల రూపాయలు, 3వ రోజున 19.5 కోట్ల రూపాయలు, 4వ రోజున 22 కోట్ల రూపాయలు, 5వ రోజున 19.5 కోట్ల రూపాయలు, 6వ రోజున 18.9 కోట్ల రూపాయలు, 7వ రోజున 17.65 కోట్ల రూపాయలు, 8వ రోజున 8 కోట్ల రూపాయలు, 9వ రోజున 5.75 కోట్ల రూపాయలు, పదో రోజున 4.2 కోట్ల రూపాయలు, 11వ రోజున 3.3 కోట్ల రూపాయలు, 12వ రోజున 2.65 కోట్ల రూపాయలు, 13వ రోజున 4.25 కోట్ల రూపాయలు, 14వ రోజున 6.2 కోట్ల రూపాయలు, 15వ రోజున 5 కోట్ల రూపాయలు, 16వ రోజున 2.1 కోట్ల రూపాయలు, 17వ రోజున 1.3 కోట్ల రూపాయలు, 18వ రోజున 1.09 కోట్ల రూపాయలు, 19వ రోజున 1.10 కోట్ల రూపాయలు, 20వ రోజున 1.6 కోట్ల రూపాయలు, 21వ రోజున 2.84 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో ఇప్పటి వరకు 207.49 కోట్ల రూపాయల నెట్... 242.55 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది.
మన శంకర వరప్రసాద్ గారు ఓవర్సీస్ కలెక్షన్స్
మన శంకర వరప్రసాద్ గారు మూవీకి నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 3.40 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 31.12 కోట్ల రూపాయలు) రాబట్టింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాలలో కలిపి మొత్తంగా ఓవర్సీస్ నుంచి చిరంజీవి మూవీకి 4.7 మిలియన్ డాలర్లు (43 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి మన శంకర వరప్రసాద్ గారు మూవీకి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 284.75 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది. అయితే 21 రోజుల వరకు చిరంజీవి సినిమా ప్రపంచవ్యాప్తంగా 418 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
మన శంకర వరప్రసాద్ గారు 3 వారాల కలెక్షన్స్
సాక్‌నిక్ లెక్కల ప్రకారం మన శంకర వరప్రసాద్ గారు మూవీకి తొలివారం 179.15 కోట్ల రూపాయలు, రెండో వారంలో 22.8 కోట్ల రూపాయలు, మూడో వారంలో 15.24 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటి వరకు కర్ణాటకలో 21.6 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 213.75 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2.95 కోట్ల రూపాయలు, కేరళలో 12 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 4.13 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది. 3 వారాల వరకు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం ఏరియాలో 45.76 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 22.60 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 22.19 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 15.56 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 9.88 కోట్ల రూపాయలు, గుంటూరులో 11.15 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 10.88 కోట్ల రూపాయలు, నెల్లూరులో 6.72 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.
మన శంకర వరప్రసాద్ గారు 22వ రోజు కలెక్షన్స్
3 వారాల వరకు కలెక్షన్ల వర్షం కురిపించిన మన శంకర వరప్రసాగ్ గారు.. వర్కింగ్ డే కావడంతో బుకింగ్స్‌పై గట్టి దెబ్బపడింది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఈ సినిమాకు 14 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. 22వ రోజు మన శంకర వరప్రసాద్ గారు మూవీ వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
మన శంకర వరప్రసాద్ గారు మూవీతో చిరంజీవి తన పేరిత రికార్డులు నెలకొల్పారు. ఇప్పటి వరకు ఈ మూవీని బుక్ మై షోలో 3.7 మిలియన్ల టికెట్స్ అమ్ముడయ్యాయి. రీజనల్ ఫిలింస్ కేటగిరిలో చిరంజీవి ఆల్ టైం రికార్డ్ సృష్టించారు. ఒక్క నైజాం ఏరియాలోనే 30 లక్షల మంది ఈ సినిమాను వీక్షించారు. ఇక సాక్‌నిక్ లెక్కల ప్రకారం మరో 10 కోట్ల రూపాయలు సాధిస్తే హనుమాన్ మూవీ (294.92 కోట్ల రూపాయలు) లైఫ్ టైం కలెక్షన్స్‌ను చిరంజీవి క్రాస్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











