MSVPG Day 3 Box Office Collections: రఫ్ఫాడిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు'.. చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లంటే?
Mana Shankara Vara Prasad Garu Collections: డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ' మన శంకర వర ప్రసాద్ గారు'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విక్టరీ స్టార్ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించడం సినిమాకు అదనపు హైప్ తీసుకొచ్చింది.ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే...
సంక్రాంతి బరిలో నిలిచిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టార్ క్యాస్ట్ కారణంగా సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే, ఆంధ్రా రైట్స్ రూ.55 కోట్లు, నైజాం రూ.32 కోట్లు, సీడెడ్ రూ.18 కోట్లు కాగా... తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తం రూ.105 కోట్ల బిజినెస్ క్లోజ్ అయ్యింది. ఇతర రాష్ట్రాలు కలిపి ఇండియా మొత్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.120 కోట్లకు చేరగా, ఓవర్సీస్‌లో నార్త్ అమెరికా రైట్స్ సుమారు రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తం వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమాకు రూ.140-150 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు అంచనా. ఈ లెక్కల ప్రకారం, సినిమా పూర్తిస్థాయిలో లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.280-300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇక కలెక్షన్ వివరాల్లోకెత్తే.. ఇండస్ట్రీ ట్రాకింగ్ లెక్కల ప్రకారం, ఈ సినిమా ప్రీమియర్ డే రోజునే సుమారు రూ.9.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇది విడుదలకు ముందే ఏర్పడిన బజ్‌కు స్పష్టమైన సూచనగా మారింది. ఆ తర్వాత డే 1 నాడు ఏకంగా రూ.32.25 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. సంక్రాంతి సెలవులు, మెగాస్టార్ చిరంజీవి క్రేజ్, ఫ్యామిలీ ఆడియెన్స్ స్పందన అన్ని కలిసిఈ భారీ ఓపెనింగ్‌కు కారణమయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సహజంగా డే 2 నాడు కాస్త డ్రాప్ కనిపించింది. ఆ రోజున సినిమా రూ.19.5 కోట్ల నెట్ (రఫ్ డేటా) వసూలు చేసినట్లు అంచనా. డే 1తో పోలిస్తే కలెక్షన్స్ తగ్గుదల ఉన్నప్పటికీ, మొత్తంగా కలెక్షన్లు మాత్రం స్ట్రాంగ్‌గా కొనసాగాయి.
ఇక మూడో రోజు కలెక్షన్ల అంచనాల విషయానికి వస్తే, ట్రేడ్ వర్గాలు మరింత స్ట్రాంగ్ ఫిగర్స్‌ను అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, నైజాంలో కలిపిరూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.6 కోట్లు, ఓవర్సీస్‌లో దాదాపు రూ.6 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన మూడో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.38 నుంచి రూ.40 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. పాజిటివ్ టాక్, పండుగ సీజన్ అడ్వాంటేజ్, మెగాస్టార్ స్టామినా అన్ని కలిసి సినిమా బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్నాయని వారు విశ్లేషిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మేకర్స్ అధికారికంగా రెండు రోజుల కలెక్షన్లను ప్రకటించారు. 'మన శంకర వరప్రసాద్ గారు' ఫస్ట్ డేనే రూ.84 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు, రెండు రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన కలెక్షన్స్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేయగా, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
అలాగే.. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ చిరంజీవి దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా యూకే & ఐర్లాండ్ మార్కెట్‌లో కేవలం 72 గంటల్లోనే 180,510 డాలర్ల గ్రాస్ వసూలు కావడం విశేషం. ఇది మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో యూకేలో 72 గంటల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో 'మన శంకరవరప్రసాద్ గారు' యూకే బాక్సాఫీస్ వద్ద నంబర్ వన్ గ్రాసర్‌గా నిలిచింది.
చిరంజీవి సంక్రాంతి బరిలో దిగితే ఎలా ఉంటుందో ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్‌కు చూపిస్తోంది. ఫెస్టివల్ సీజన్‌లో మెగాస్టార్ మూవీకి హిట్ టాక్ వస్తే కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో స్పష్టంగా రుజువవుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే, రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. నిర్మాతలు అయితే ఈ సినిమా రూ.400 నుంచి రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేసే సామర్థ్యం ఉందని నమ్మకంగా చెబుతున్నారు. సంక్రాంతి సెలవుల పూర్తి ప్రభావం పడే రోజుల్లో 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ ప్రయాణం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











