MSVPG Day 4 Box Office Collections: బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ.. ‘మన శంకర వరప్రసాద్‌ గారు' కి ఎన్ని కోట్లంటే?

Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు ( Mana Shankara Vara Prasad Garu) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ప్రమోషన్స్ నుంచే భారీ స్పందన వచ్చింది. సంక్రాంతి బరిలో ఇతర సినిమాతో పోటీ పడుతూ.. స్ట్రాంగ్‌ కలెక్షన్లతో దుసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని రూపొందించిన ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాను సుమారు రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మించారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నటీనటులు, టెక్నికల్ టీమ్ రెమ్యునరేషన్లు, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఈ బడ్జెట్ ఖర్చయింది. ప్రమోషనల్ కంటెంట్‌కు వచ్చిన క్రేజ్‌తో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.

Mana Shankara Vara Prasad Garu Collections

థియేట్రికల్ బిజినెస్ పరంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్రా రూ.55 కోట్లు, నైజాం రూ.32 కోట్లు, సీడెడ్ రూ.18 కోట్లు కలిపి మొత్తం రూ.105 కోట్ల బిజినెస్ క్లోజ్ అయింది. ఇతర రాష్ట్రాలు కలిపి ఇండియా మొత్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.120 కోట్లకు చేరగా, ఓవర్సీస్‌లో నార్త్ అమెరికా రైట్స్ దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తం వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమాకు రూ.140 150 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం రేంజ్ ఈవెన్ సాధించాలంటే.. రూ.280-300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అవసరమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక కలెక్షన్ వివరాల్లోకెత్తే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజై పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. ఇండస్ట్రీ ట్రెడ్ లెక్కల ప్రకారం, ఈ సినిమా ప్రీమియర్ డే రోజునే సుమారు రూ. 9. 35 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత డే 1 నాడు ఏకంగా రూ.32.25 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. సంక్రాంతి సెలవులు, మెగాస్టార్ చిరంజీవి క్రేజ్, ఫ్యామిలీ ఆడియెన్స్ స్పందన అన్ని కలిసిఈ భారీ ఓపెనింగ్‌కు కారణమయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక రెండో రోజు (మంగళవారం) రోజున కాస్త డ్రాప్ కనిపించింది. ఆ రోజు సినిమా రూ.18.75 కోట్ల నెట్ వసూలు చేయగా, మొదటి రోజుతో పోలిస్తే సుమారు 41.86 శాతం తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ, మొత్తంగా స్ట్రాంగ్ వసూళ్లు అందుకుంది. డే 3 (బుధవారం) రోజున మళ్లీ కాస్త రికవరీ కనిపించింది. బుధవారం సినిమా రూ.19.50 కోట్ల నెట్ వసూలు చేసి, మంగళవారంతో పోలిస్తే 4 శాతం గ్రోత్ నమోదు చేయడం విశేషం.

ఇక నాలుగు రోజు కలెక్షన్ల అంచనాల విషయానికి వస్తే.. ట్రేడ్ వర్గాలు మరింత స్ట్రాంగ్ ఫిగర్స్‌ను అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, నైజాంలో కలిపి రూ. 15 నుంచి రూ. 18 కోట్ల వరకు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో దాదాపు రూ. 2 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన నాలుగో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ. 24 నుంచి 26 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం.. మొత్తం నాలుగు రోజుల్లో సినిమా ఇండియాలో రూ. 104 నుంచి 106 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించవచ్చని అంచనా. పాజిటివ్ టాక్, పండుగ సీజన్ అడ్వాంటేజ్, మెగాస్టార్ స్టామినా అన్ని కలిసి సినిమా బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్నాయని వారు విశ్లేషిస్తున్నారు.

ఇక మూవీ మేకర్స్ అధికార ప్రకటన ప్రకారం.. మన శంకర వర ప్రసాద్ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.152 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సంక్రాంతి పండుగ సెలవుల ప్రభావంతో ఫ్యామిలీ ఆడియెన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు రావడం వల్ల సినిమాకు ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ కనిపిస్తోంది. మొదటి రోజునే రూ.84 కోట్ల వసూళ్లతో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా, మూడో రోజు మకర సంక్రాంతి అడ్వాంటేజ్‌ను పూర్తిగా ఉపయోగించుకుని 150 కోట్ల మార్క్‌ను ఈజీగా దాటేసింది.

ఇదే జోరు కొనసాగితే, రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిర్మాతలు అయితే ఈ సినిమా రూ.400-500 కోట్ల గ్రాస్ రేంజ్‌ను టచ్ చేసే అవకాశం ఉందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా 'మన శంకరవరప్రసాద్ గారు' సంక్రాంతి విన్నర్‌గా నిలిచి, మెగా అభిమానులకు నిజమైన పండుగను అందించిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X