MSVPG Box Office: మన శంకర వరప్రసాద్ కలెక్షన్ల ధమాకా.. బాహుబలి, కల్కిపై కన్నేసిన చిరంజీవి మూవీ
మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతూ భారీగా కలెక్షన్లను సాధిస్తున్నది. షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం రికార్డు వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రం గత రెండు వారాల్లో ఊహించిన కలెక్షన్లు సాధించి డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతున్నది. ఈ చిత్రం బాహుబలి, కల్కి సినిమాల రికార్డుకు చేరువగా రావడం ట్రేడ్ వర్గాల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఈ సినిమా సీడెడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మన శంకర వరప్రసాద్ చిత్రం ప్రమోషన్స్‌కు మంచి స్పందన రావడంతో తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా సీడెడ్ ప్రాంతం థియేట్రికల్ రైట్స్ 18 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 19 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఆ ప్రాంతంలో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సీడెడ్ ప్రాంతంలో ప్రదర్శించిన ప్రీమియర్లు, తొలి ఆట తర్వాత సూపర్ హిట్ టాక్ రావడంతో చిరంజీవి సినిమాకు ఎదురే లేకుండా పోయింది. సీడెడ్‌లోని చిత్తూరు, కర్నూల్, కడప, అనంతపురం, బెళ్లారి ప్రాంతంలో రికార్డు కలెక్షన్లు రాబట్టింది. రెండు వారాల తర్వాత కూడా ఈ సినిమా బలంగా వసూళ్లను సాధిస్తున్నదని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు.
గత రెండు వారాల్లో ఈ సినిమా చిత్తూరులో 9.35 కోట్లు, కర్నూలులో 7.37 కోట్ల రూపాయలు, కడపలో 5.6 కోట్ల రూపాయలు, అనంతపురంలో 5.3 కోట్లు, బెళ్లారి 1.64 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 30 కోట్ల రూపాయల గ్రాస్, జీఎస్టీ మినహాయించి 21 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది అని తెలిపారు.
ఇక ఈ చిత్రం సీడెడ్‌లో బాహుబలి, కల్కి2898AD నెలకొల్పిన రికార్డులపై కన్నేసింది. బాహుబలి 21.8 కోట్ల రూపాయల షేర్, కల్కి 21.5 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. త్వరలోనే ఈ రికార్డులను శంకర వరప్రసాద్ మూవీ అధిగమించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ సినిమా భారీ లాభాలను పంచిపెడుతూ రికార్డులను కూడా క్రియేట్ చేయడం మెగా ఫ్యాన్స్‌లో జోష్ పెంచింది అని డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











