నాగ చైతన్య తల్లి స్పందన: మిలియన్ డాలర్ల క్లబ్‌లో ‘మనం’
హైదరాబాద్: అక్కినేని మల్టీ స్టారర్ మూవీ యూఎస్ బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. అమెరికాలో విడుదలైన 5 రోజుల్లోనే ఈచిత్రం మిలియన్ డాలర్ల కలెక్షన్ వసూలు చేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం అక్కడ తొలి 5 రోజుల్లో $1,000,480(దాదాపు 5.9 కోట్లు) వసూలు చేసింది.
ఈ చిత్రాన్ని నాగ చైతన్య తల్లి (నాగార్జున మొదటి భార్య)కూడా చూసింది. అమ్మ నా నటనను మెచ్చుకుంది. ఆమెకు ఈ సినిమా బాగా నచ్చింది. నా నటనలో మెచ్యూరిటీ వచ్చిందని చెప్పింది. యూఎస్‌లో అక్కినేని ఫ్యామిలీ మూవీ తొలిసారిగా మిలియన్ డాలర్లు క్రాస్ కావడం ఆనందంగా ఉందని నాగ చైతన్య పేర్కొన్నారు.
'మనం' చిత్రానికి ఇంత మంచి ఆదరణ లభిస్తుండటంపై నిర్మాత, నటుడు అక్కినేని నాగార్జున ఆనందం వ్యక్తం చేసారు. 'మనం' చిత్రం విజయం సాధించడాన్ని స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుకు ఘనమైన నివాళిగా అభిమానులు భావిస్తున్నారు.

అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.


Click it and Unblock the Notifications











