‘మనం’ 3 వీక్స్ కలెక్షన్.....ఏరియా వైజ్
హైదరాబాద్ : అక్కినేని మల్టీస్టారర్ మూవీ 'మనం' మే 23న విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన ప్రతి చోటా సక్సెస్ ఫుల్‌గా రెండో వారంలోనూ రన్ అవుతోంది. తాజాగా ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మూడు వారాలు పూర్తి చేసుకుంది. మూడు వారాల్లో ఈచిత్రం వరల్డ్ వైడ్ దాదాపు రూ. 33 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలు నటించిన సినిమా కావడం, మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడం, ఏఎన్ఆర్ నటించిన చివరి సినిమా కావడం, అఖిల్ ఇంట్రడక్షన్ కూడా ఉండటం లాంటి అంశాలు ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పిస్తున్నాయి. సినిమా హిట్ కావడంతో మరో వైపు శాటిలైట్ రైట్స్ కూడా భాగానే వచ్చాయి.
ఇప్పటి వరకు మనం చిత్రం వరల్డ్ వైడ్ సాధించిన కలెక్షన్ వివరాలు ఏరియా వైజ్...

నైజాం
నైజాం ఏరియాలో ‘మనం' చిత్రం తొలి మూడు వారాల్లో రూ. 8.97 కోట్లు వసూలు చేసింది.

సీడెడ్ ఏరియాలో
సీడెడ్ ఏరియాలో ‘మనం' చిత్రం తొలి మూడు వారాల్లో రూ. 3.33 కోట్లు వసూలు చేసింది.

వైజాగ్ ఏరియాలో
వైజాగ్ ఏరియాలో ‘మనం' చిత్రం తొలి మూడు వారాల్లో రూ. 2.66 కోట్లు వసూలు చేసింది.

గుంటూరు ఏరియాలో
గుంటూరు ఏరియాలో ‘మనం' చిత్రం తొలి మూడు వారాల్లో రూ. 1.75 కోట్లు వసూలు చేసింది.

కృష్ణా ఏరియాలో...
కృష్ణా ఏరియాలో ‘మనం' చిత్రం తొలి మూడు వారాల్లో రూ. 1.64 కోట్లు వసూలు చేసింది.

నెల్లూరు ఏరియాలో
నెల్లూరు ఏరియాలో ‘మనం' చిత్రం తొలి మూడు వారాల్లో రూ. 73 లక్షలు వసూలు చేసింది.

వెస్ట్ గోదావరి
వెస్ట్ గోదావరి బాక్సాఫీసు వద్ద ‘మనం' చిత్రం రూ. 1.21 కోట్లు వసూలు చేసింది.

ఈస్ట్ గోదావరి
ఈస్ట్ గోదావరి బాక్సాఫీసు వద్ద ‘మనం' చిత్రం రూ. 1.58 కోట్లు వసూలు చేసింది.

కర్నాటక
కర్నాటకలో ‘మనం' చిత్రం తొలి మూడు వారాల్లో రూ. 1.70 కోట్లు రాబట్టింది.

తమిళనాడు, కేరళ
తమిలనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘మనం' చిత్రం తొలి మూడు వారాల్లో రూ. 35 లక్షలు వసూలు చేసింది.

నార్త్ ఇండియా
నార్త్ ఇండియాలో మనం చిత్రం రూ. 4 లక్షలు వసూలు చేసింది.

ఓవర్సీస్
ఓవర్సీస్ బాక్సాఫీసు వద్ద ‘మనం' మూడు వారాల్లో చిత్రం రూ.8.77 కోట్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











