మెగా హీరో రికార్డును బద్దలు కొట్టిన‘మనం’
హైదరాబాద్: అక్కినేని మల్టీ స్టారర్ మూవీ 'మనం' కలెక్షన్ల పరంగా దూసుకెలుతోంది. ముఖ్యంగా యూఎస్ఏలో కలెక్షన్ల పరంగా యమా స్పీడుగాగా ఉంది. తాజాగా ఈచిత్రం మెగా హీరో అల్లు అర్జున్ నటించిన 'రేసుగుర్రం' చిత్రం యూఎస్ఏ కలెక్షన్లను అధిగమించింది.
రేసుగుర్రం చిత్రం అమెరికా వ్యాప్తంగా ఏప్రిల్ 10వ తేదీన 66కుపైగా స్క్రీన్లలో విడుదలైంది. తొలి వారంలో రూ. 5.93 కోట్లు($ 982,155) వసూలు చేసింది. అయితే 'మనం' చిత్రం ఆ రికార్డును అధిగమించింది. మొత్తం 108 స్క్రీన్లలో విడుదలైన ఈచిత్రం ఆరు రోజుల్లోనే రూ. 6.26 కోట్లు వసూలు చేసింది. మనం చిత్రం చిత్రం భారీగా వసూళ్లు రాబడుతుండటం, ఈ మధ్య కాలంలో ఇతర పెద్ద సినిమాల విడుదల కూడా లేక పోవడంతో స్క్రీన్ల సంఖ్య పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషించారు.
ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.


Click it and Unblock the Notifications











