Manamey Closing Collections: 25 కోట్ల టార్గెట్.. మనమే హిట్టా? ఫట్టా? ఓవరాల్‌గా ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం మనమే. యువ దర్శకుడు ఆదిత్య శ్రీరాం దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాలో శర్వానంద్, కృతిశెట్టి హీరో, హీరోయిన్లుగా నటించారు. సీరత్ కపూర్, ఆయేషా ఖాన్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. జూన్ 7వ తేదీన రిలీజైన ఈ చిత్రంలో బాక్సాఫీస్ జర్నీలో ఏ మేరకు కలెక్షన్లు సాధించారనే విషయంలోకి వెళితే..
మనమే సినిమాను లావీష్‌గా విదేశాల్లో నిర్మించడంతో బడ్జెట్ భారీగానే జరిగింది. అన్ని ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. నైజాంలో 12 కోట్ల రూపాయలు, ఏపీలో 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో 3 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.

ఇక మనమే సినిమాలో క్రేజీ కాంబినేషన్ ఉన్నప్పటికీ.. రిలీజ్‌కు ముందు అంతగా రెస్పాన్స్ కనిపించలేదు. ఈ సినిమాను నైజాంలో 600 స్క్రీన్లు, ఏపీలో 500 స్క్రీన్లలో రిలీజ్ చేయగా.. ఇతర ప్రాంతాల్లో 250 స్క్రీన్లలో విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఊపందుకోలేకపోయాయి. రిలీజైన తర్వాత వచ్చిన వసూళ్లు పెరగలేకపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఫర్వాలేదనే విధంగా కలెక్షన్లను సాధించింది. తొలి నాలుగు రోజుల్లో ఒకే అనిపించే విధంగా వసూళ్లు నమోదు అయ్యాయి. తొలి రోజు 3.5 కోట్లు, రెండో రోజు 3 కోట్లు, మూడో రోజు 3 కోట్లు, నాలుగో రోజు 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత పెద్దగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం ఈ సినిమా చూపించలేకపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మనమే సినిమా తొలివారం ముగిసే సమయానికి సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 11.5 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండు వారాల్లో ఈ సినిమా మొత్తంగా 15 కోట్ల రూపాయలు ఇండియాలో, 20 కోట్ల గ్రాస్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడానికి కష్టాలు పడిందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపించింది.
ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం.. మనమే సినిమా సుమారుగా 24 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌గా బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. అయితే ఈ మూవీ ఇంకా 5 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. థియేట్రికల్‌గా నష్టాల్లో ముగిసే ఛాన్స్ కనిపిస్తున్నది. అయితే డిజిటల్, శాటిలైట్ బిజినెస్ లెక్కల ప్రకారం.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ సాధించిందనే తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











