Manamey Collections: శర్వానంద్ మూవీకి ఊహించని కలెక్షన్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్, హీరోయిన్ కృతిశెట్టి నటించిన చిత్రం మనమే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రానికి ఆదిత్య శ్రీరాం దర్వకత్వం వహించారు. సీరత్ కపూర్, ఆయేషా ఖాన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? వసూళు చేస్తున్న కలెక్షన్లు, అలాగే బ్రేక్ ఈవెన్ ఎంత అనే వివరాల్లోకి వెళితే.
రొమాంటిక్ ప్రేమకథగా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఓ క్లిష్టమైన పరిస్థితుల్లో రిలీజైంది. వరుస వైఫల్యాలతో కొనసాగుతున్న శర్వానంద్, కృతిశెట్టికి తప్పనిసరి హిట్టుగా మారాల్సిన నేపథ్యంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ నమోదైంది.

ఇక ఈ మూవీని చాలా లావిష్‌గా, ఫారిన్‌లో గ్రాండ్‌గా పిక్చరైజ్ చేశారు. బ్రిటన్, ఇతర ప్రాంతాల్లో సన్నివేశాలను రిచ్‌గా చిత్రీకరించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయిందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపించింది. ఈ సినిమాకు ప్రమోషన్స్, ప్రొడక్షన్ వాల్యూస్‌తో కలిపి మొత్తంగా 58 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని తెలిసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 60 కోట్లు రాబట్టాల్సిన పరిస్థితుల్లో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది.
ఇక మనమే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి భారీగానే బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ బిజినెస్ 13 కోట్లుగా జరిగింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్'గా 14 కోట్లు వసూలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ఇక ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా 700 స్క్రీన్లలో రిలీజైంది.

మనమే సినిమా తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఓ రేంజ్‌లో వసూళ్లు నమోదు అయిందని ట్రేడ్ వర్గాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మేర వసూళ్లను సాధించే అవకాశం ఉంది. అయితే ఇక ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మేర కలెక్షన్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











