Manasantha Nuvve Re Release Collections: మనసంతా నువ్వే రీ రిలీజ్‌కు భారీ కలెక్షన్లు.. ఉదయ్ కిరణ్ మూవీకి క్రేజ్

టాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు నిర్మించిన చిత్రం మనసంతా నువ్వే. యంగ్ హీరో, స్వర్గీయ ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. తనురాయ్, సిజ్జు, పరుచూరి, చంద్రమోహన్, బ్రహ్మానందం, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకొన్నది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని రికార్డు వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను కొత్త అనుభూతిని అందించే విధంగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించారు. స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫిని, కేవీ కృష్ణారెడ్డి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. నిర్మాత ఎంఎస్ రాజు కథను అందించిన ఈ చిత్రం 2001 అక్టోబర్ 19వ తేదీన రిలీజై సంచలన విజయాన్ని నమోదు చేసుకొన్నది. ఈ సినిమా మరోసారి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Manasantha Nuvve Re Release Box Office

మనసంతా నువ్వే సినిమా రీ రిలీజ్‌ను పురస్కరించుకొని ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులు ఎమోషనల్ అయ్యారు. ఆయనను తలచుకొంటూ వీడియోల రూపంలో ఈ సినిమా గురించి ప్రస్తావించారు. 25 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా గురించి భావోద్వేగంతో మాట్లాడారు. ఈ సినిమాను మరోసారి థియేటర్లలో ఆదరించమని రిక్వెస్ట్ చేశారు. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద టికెట్లు భారీగా అమ్ముడుపోయాయి.

ఉదయ్ కిరణ్ నటించిన ఈ సినిమాను మూడు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీని 60 పట్టణాలల్లో, 130 లోకేషన్లలో, 150 స్క్రీన్లలో ప్రదర్శించారు. ఫిబ్రవరి 14వ రోజున సుమారుగా 335 షోలు ప్రదర్శించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 35 వేల టికెట్లు అమ్ముడుపోయాయి అని తెలిపారు.

మనసంతా నువ్వే రీ రిలీజ్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో గౌరవ ప్రదమైన వసూళ్లు నమోదు అయ్యాయి. తొలి రోజు 50 లక్షల రూపాయల నెట్, 75 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. రెండో రోజున కూడా క్రేజీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయింది. ఆదివారం మొత్తంగా 25 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా 50 లక్షల రూపాయల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మూడో రోజున ఈ సినిమా 25 లక్షల రూపాయలు రాబట్టింది. నాలుగో రోజున 20 లక్షలు వసూలు చేసింది. ఈ చిత్రం నాలుగు రోజుల్లో 1.65 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మనసంతా నువ్వే సినిమాను నిర్మాత ఎంఎస్ రాజు తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను సుమారుగా 5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో డిస్టిబ్యూటర్లకు సుమారుగా 16 కోట్ల రూపాయల షేర్ పంచిపెట్టింది. 2001 ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X