Manchi Rojulu Vachayi Day 1 Collections: మొదటి రోజే షాక్ ఇచ్చిన కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే?

కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సెట్ చేసుకున్న దర్శకుడు మారుతి చిన్న బడ్జెట్లో సినిమా నిర్మించి భారీ స్థాయిలో విజయాలను అందుకుంటూ ఉంటాడు. ఈ దర్శకుడి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీలైనంత వరకు కమర్షియల్ దారుల్లోనే ప్రేక్షకును నవ్వించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ప్రతి రోజూ కనిపించే సమస్యలు కూడా సినిమాలో చాలా సరదాగా చూపిస్తూ వీలైతే కాస్త ఎమోషన్ ను టచ్ చేస్తూ ఉంటాడు.

ఇక ఈ సారి కాస్త కరోనా సమస్యను జతచేస్తూ మంచి రోజులు సినిమాతో నవ్వించే ప్రయత్నం చేశాడు. అంతే కాకుండా మంచి సందేశం కూడా ఇచ్చాడు. ఇక ఈ సినిమా మొదటి రోజు భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ వచ్చాయి.

20 రోజుల్లోనే కథ రెడీ

20 రోజుల్లోనే కథ రెడీ

ప్రతి రోజు పండగే సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న మారుతి ఆ తర్వాత వెంటనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా తన ప్లాన్ అన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఇక గోపిచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తూనే మరొక చిన్న సినిమా కూడా చేయాలని మంచిరోజులు వచ్చాయి కదను సిద్ధం చేసుకున్నాడు. ఈ కథను కేవలం 20 రోజుల్లోనే రాసుకున్నాడట.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

సంతోష్ శోభన్ మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటించిన మంచి రోజులు వచ్చాయి సినిమా యు.వి.క్రియేషన్స్ అనుబంధ సంస్థ ఈ యూవీ కాన్సెప్ట్ లో నిర్మించారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం కూడా ఒకే లొకేషన్లో జరిగిందినట్లు మారుతి చెప్పాడు. వీలైనంత తక్కువ బడ్జెట్లోనే సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారట. ఆ తర్వాత మెల్లమెల్లగా కొంత బడ్జెట్ పెరిగినట్లు తెలిపారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మార్కెట్ లోకి అడుగు పెట్టింది.

మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్

మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్

ఇక మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో 32 లక్షలు, సీడెడ్‌లో 14 లక్షలు, ఉత్తరాంధ్రతో 6 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 5 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 లక్షలు, గుంటూరులో 6 లక్షలు, కృష్ణా జిల్లాలో 5.4 లక్షలు, నెల్లూరులో 5 లక్షలు వచ్చాయి. ఆంధ్రా, నైజాంలో మొదటి రోజు 0.77 కోట్ల షేర్ రాగా టోటల్ గా 1.25 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

ప్రపంచం వ్యాప్తంగా వచ్చిన వసూళ్ళు

ప్రపంచం వ్యాప్తంగా వచ్చిన వసూళ్ళు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో 77 లక్షల షేర్ అందుకున్న మంచి రోజులు వచ్చాయి సినిమా కర్ణాటక తో పాటు మిగతా రాష్ట్రాలలో కేవలం నాలుగు లక్షల మాత్రమే షేర్ మాత్రమే అందుకుంది. ఓవర్సీసీస్ లో ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రాలేవు. అక్కడ కేవలం ఐదు లక్షల షేర్ మాత్రమే వచ్చాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటిరోజు 0.86 కోట్ల షేర్ రాగా 1.45కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Recommended Video

Bigg Boss Sarayu బోల్డ్ Comments On Sudarshan, Maruthi | Manchi Rojulochaie
ఇంకా ఎంత రావాలంటే?

ఇంకా ఎంత రావాలంటే?

ఇక సినిమా మొత్తంగా 10 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ అందుకోవాలి అంటే 10.5 కోట్ల వరకు షేర్ చేయాల్సి ఉంటుంది. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ గా మొదటిరోజు 86 లక్షలు మాత్రమే రావడంతో సినిమా ఇంకా 9.64కోట్ల వరకు షేర్ ను అందుకోవాల్సి ఉంటుంది. మరి ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X