Manchi Rojulu Vachayi Day 3 Collections: దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. మూడో రోజు ఎంతంటే?
దర్శకుడు మారుతి చాలా తక్కువ రోజుల్లో చేసిన సినిమా మంచి రోజులు వచ్చాయి. దీపావళి సందర్భంగా రజనీకాంత్ పెద్దన్న, విశాల్ ఎనిమీ లాంటి సినిమాలతో పోటీ పడి మరీ రిలీజ్ చేశాడు. దీంతో ఈ సినిమా సూపర్ ఉంటుందని, భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక మూడు రోజులలో ఈ సినిమా ఎన్ని కలెక్షన్స్ సాధించిందనేది చూస్తే.

మంచి అంచనాలతో
సంతోశ్ శోభన్, మెహరీన్ కౌర్ ఫిర్జాదా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మంచి రోజులు వచ్చాయి. కేవలం 20 రోజుల్లో కథ రాసి 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను విడుదల చేశాడు మారుతి. ఒకవైపు గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా చేస్తూ మధ్యలో గ్యాప్ తీసుకుని కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ లో మంచి రోజులు వచ్చాయి సినిమా పూర్తి చేశాడు. అలా యు.వి.క్రియేషన్స్ అనుబంధ సంస్థ ఈ యూవీ కాన్సెప్ట్ లో నిర్మించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం కూడా ఒకే లొకేషన్లో జరిగింది. మారుతి బ్రాండ్ ఇమేజ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మార్కెట్ లోకి అడుగు పెట్టింది.

మూడో రోజు వచ్చిన కలెక్షన్స్
మొదటి రెండు రోజుల కలెక్షన్స్ తక్కువగానే ఉన్నా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో 11 లక్షలు, సీడెడ్‌లో 5 లక్షలు, ఉత్తరాంధ్రతో 4 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 3 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షలు, గుంటూరులో 3 లక్షలు, కృష్ణా జిల్లాలో 2 లక్షలు, నెల్లూరులో 1 లక్షలు వచ్చాయి. ఆంధ్రా, నైజాంలో మూడో రోజు 0.31 కోట్ల షేర్ రాగా టోటల్ గా 0.52 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

మొదటి మూడు రోజులలో
మొదటి మూడు రోజులలో తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో 59 లక్షలు, సీడెడ్‌లో 26 లక్షలు, ఉత్తరాంధ్రతో 16 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 13 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 లక్షలు, గుంటూరులో 12 లక్షలు, కృష్ణా జిల్లాలో 10 లక్షలు, నెల్లూరులో 8 లక్షలు వచ్చాయి. ఆంధ్రా, నైజాంలో మొదటి రెండు రోజులలో 1.53 కోట్ల షేర్ రాగా టోటల్ గా 2.52 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

ప్రపంచం వ్యాప్తంగా వచ్చిన వసూళ్ళు
రెండు రోజులకు కలిపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో 1.53 కోట్ల షేర్ అందుకున్న మంచి రోజులు వచ్చాయి సినిమా కర్ణాటక తో పాటు మిగతా రాష్ట్రాలలో కేవలం ఆరు 8 మాత్రమే షేర్ మాత్రమే అందుకుంది. ఓవర్సీసీస్ లో ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రాలేవు. అక్కడ కేవలం 13 లక్షల షేర్ మాత్రమే వచ్చాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజులలో 1.74 కోట్ల షేర్ రాబట్టగా 3 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
Recommended Video

ఇంకా ఎంత రావాలంటే?
ఇక సినిమా మొత్తంగా 10 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ అందుకోవాలి అంటే 10.5 కోట్ల వరకు షేర్ చేయాల్సి ఉంటుంది. ఇక మూడు రోజులలో వరల్డ్ వైడ్ గా 1.74 కోట్ల మాత్రమే రావడంతో సినిమా ఇంకా 8.76 కోట్ల వరకు షేర్ ను అందుకోవాల్సి ఉంటుంది. మరి ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











