Ginna Pre Release Bussiness: మంచు విష్ణు సినిమా బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు విష్ణు పలు సినిమాలతో మంచి గుర్తింపు అయితే అందుకున్నాడు. అయితే అతను బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చూసి చాలా కాలం అయింది. మళ్ళీ ఎలాగైనా ఢీ లాంటి బాక్స్ ఆఫీస్ సక్సెస్ ను చూడాలి అని మంచి విష్ణు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక అతను ఈసారి ఎంతో నమ్మకంతో చేసిన జిన్నా అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత బిజినెస్ చేసింది? సక్సెస్ కావాలి అంటే ఎంత రావాలి అనే వివరాల్లోకి వెళితే..

జిన్నాపై పాజిటివ్ హైప్
జిన్నా సినిమా ట్రైలర్ తోనే మంచి విష్ణు కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేశాడు. ఇందులో గ్లామరస్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా మరొక ముఖ్యమైన పాత్రలో మాజీ శృంగార తార సన్నిలియోన్ కూడా నటించింది. ఇక ఈ ఇద్దరితోనే మంచి విష్ణు పలు రియాల్టీ షో లలో ప్రమోషన్స్ కూడా చేశాడు. ఇంటర్వ్యూ లతో కూడా చాలా బిజీగా కనిపించాడు.

మంచు విష్ణు కాన్ఫిడెన్స్
ఇక ఈసారి జిన్నా సినిమాతో తప్పకుండా విజయం అందుకుంటాను అని విష్ణు ఇంటర్వ్యూలలో ఎంతో నమ్మకంగా తెలియజేశాడు. ఈ సినిమా ట్రైలర్ కు ఆడియెన్స్ చాలా పాజిటివ్ గా స్పందించారు అని నేను అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని అన్నాడు. సినిమాలో మంచి కామెడీ తో పాటు త్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా హైలెట్ అవుతాయని ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలియజేశాడు.

రేంజ్ కు తగ్గట్టుగా
జిన్నా సినిమాకు అసలు కథను కోన వెంకట అందించారు. ఇక రచన డైలాగ్స్ ను జి నాగేశ్వర్ రెడ్డి అందించగా కొత్త దర్శకుడు సూర్య ఈ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ తో పాటు సాంగ్స్ కూడా యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక సినిమా రేంజ్ కు తగ్గట్టుగా మంచి బిజినెస్ జరిగింది అని కూడా చిత్ర సభ్యులు తెలియజేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ రిలీజ్ బిజినెస్
ఇక మొత్తంగా ట్రేడ్ వర్గాల ప్రకారం జిన్నా సినిమా ఏ స్థాయిలో బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జిన్నా సినిమాకు 4 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఒక విధంగా ఇది పెద్ద టార్గెట్ కాకపోయినప్పటికీ పోటీగా మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. కాబట్టి ఎంతో పాజిటివ్ టాక్ వస్తే గాని కలెక్షన్స్ భారీ స్థాయిలో వచ్చే అవకాశం లేదు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే జిన్నా సినిమా 4.5 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే కనీసం 5 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. సినిమాలో సన్నిలియోన్ ఉండడంతో ఓ వర్గం ఆడియన్స్ ఈ సినిమాపై కొంత ఆసక్తిని చూపించే అవకాశం ఉంది. ఇక కామెడీ వర్కౌట్ అయితే గనుక మొదటి వారంలోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి రావచ్చు మరి సినిమా జనాలను ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











