Kannappa Vs Maa Collections : కన్నప్పకు షాకిస్తున్న కాజోల్.. బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ హీరోయిన్ జాతర
మంచు విష్ణు తాజాగా కన్నప్ప చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం తెలుగు తో పాటు హిందీ, ఇతర భాషల్లోనూ గ్రాండ్ గా రిలీజ్ అయింది. తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రానికి భారీగానే వసూళ్లు దక్కుతున్నాయి. ఇక నార్త్ ఇండియాలో ఈ చిత్రం అంతంత మాత్రమే బాక్సాఫీస్ కలెక్షన్లను రాబడుతోంది. ఈ చిత్రానికి ప్రధానంగా హిందీలో విడుదలైన కాజోల్ నటించిన మా చిత్రం గట్టి పోటీని ఇస్తుంది. ఈ క్రమంలో అక్కడ కలెక్షన్ల వివరాలు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే...
కన్నప్ప వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..
జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన కన్నప్ప చిత్రానికి తెలుగు స్టేట్స్ లో, ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ దక్కుతోంది. కన్నప్ప చిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు 3రోజుల్లో ఇండియా నెట్ రూ.23.1 కోట్లకు చేరుకోవడం విశేషం. ఇక ఇండియా గ్రాస్ రూ.25 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికి భారీగానే రెస్పాన్స్ దక్కుతోంది. కేవలం 2 రోజుల్లోనూ రూ.3.6 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

కాజోల్ మా చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లు..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అజయ్ దేవగన్ భార్య కాజోల్ నటించిన తాజా చిత్రం 'మా'. ఈ చిత్రం కూడా జూన్ 27నే గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. కేవలం హిందీ భాషలోనే విడుదలైంది. నార్త్ ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి 3 రోజుల్లో హిందీలో రూ.17.4 కోట్ల ఇండియా నెట్, రూ.2.1 కోట్ల ఓవర్సీస్ కలెక్షన్లు దక్కాయి. దీంతో వరల్డ్ వైడ్ గా రూ.25 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
హిందీలో కన్నప్పకు టఫ్ ఫైట్..
అయితే ప్రస్తుతం కన్నప్ప చిత్రానికి హిందీ మార్కెట్ లో కాజోల్ మా చిత్రం టఫ్ ఫైట్ ఇస్తోంది. కన్నప్ప చిత్రంలో భారీ తారాగాణం నటించిన సంగతి తెలిసిందే. హిందీ నుంచి స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటించడం, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా కీలక పాత్ర పోషించడంతో సినిమాకు గట్టి ప్రమోషన్ జరిగింది. దాంతో హిందీ బాక్సాఫీస్ లో మంచి వసూళ్లు వస్తాయని ఆశించారు.
కానీ కన్నప్ప చిత్రం హిందీ బెల్డ్ లో కేవలం ఇప్పటి వరకు రూ.2.51 కోట్లు మాత్రమే వసూళ్లు చేసింది. ప్రస్తుతం నార్త్ ఇండియా మొత్తం కాజోల్ హవానే కొనసాగుతోంది. ఒకే రోజు ఈ రెండు చిత్రాలు విడుదలైనప్పటికీ హార్రర్ జోనర్ లో రూపుదిద్దుకున్న మా చిత్రానికి హిందీ ఆడియెన్స్ మొగ్గు చూపుతున్నారు. ఇలా పరిస్థితుల్లో ఇక కన్నప్పకు తెలుగు స్టేట్స్ తో పాటు, ఓవర్సీస్ లోనే వసూళ్లు రాబట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.200 కోట్లతో తెరకెక్కిన కన్నప్ప మున్ముందు వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











