Don't Miss!
- News భారత్లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
Mosagallu 2 days collections: 50కోట్లు పెడితే మరీ ఇంత తక్కువనా.. రెండవ రోజు కూడా షాక్
కలెక్షన్ కింగ్ తనయుడు మంచు విష్ణు చాలా రోజుల తరువాత మోసగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ పెట్టుబడితో తెరకెక్కిన ఈ సినిమాను విష్ణు సొంత ప్రొడక్షన్ లో తెరకెక్కించాడు. అయితే సినిమా కలెక్షన్స్ మాత్రం ఊహించని రేంజ్ లో వస్తున్నాయి. మరీ ఇంత తక్కువగా వస్తాయని ఎవరు అనుకోలేదు. ఇక సినిమాకు రెండవ రోజు వచ్చిన కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..
పొట్టి బట్టలతో టాలీవుడ్ పాపులర్ యాంకర్ ఫోటోషూట్ (ఫొటోలు)
పాన్ ఇండియా సినిమాగా
మోసగాళ్ళు సినిమా ఇండియన్ బిగెస్ట్ మనీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టాక్ అయితే మిక్సీడ్ గానే ఉంది. విడుదలైన టీజర్ ట్రైలర్ కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా సినిమాగా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేశారు.
30కోట్లు వచ్చినట్లే
ఈ సినిమాలో మంచు విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ నటించింది. అలాగే నవదీప్, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర లాంటి టాలెంటెడ్ నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమా కోసం 50కోట్ల వరకు ఖర్చు చేయగా ముందుగానే నాన్ థియేట్రికల్ గా సినిమా 30కోట్ల వరకు లాభాలను అందించింది. ఇక 20కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మార్కెట్ లోకి వచ్చింది.
హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతున్న ముదురు భామ తనుశ్రీ (ఫొటోలు)
రెండవ రోజు వచ్చిన కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా వచ్చిన మొత్తం షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాం 4లక్షలు, సీడెడ్ 2లక్షలు, ఉత్తరాంధ్ర 2.4లక్షలు, ఈస్ట్ 1.6లక్షలు, వెస్ట్ 1లక్ష, గుంటూరు 1.5లక్షలు, కృష్ణ 1.6లక్షలు, నెల్లూరు 1లక్ష.. తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో వచ్చిన మొత్తం షేర్స్ 0.15కోట్లు. గ్రాస్ 0.30కోట్లు
ఇంకా ఎంత రావాలి అంటే?
సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21కోట్లు. మొదటి రోజే సినిమా ప్రపంచవ్యాప్తంగా 34లక్షల షేర్స్ ను రాబట్టింది. కనీసం కోటి రూపాయల షేర్స్ రాకపోవడం ఆశ్చర్యకరం. రెండవరోజు కూడా వరల్డ్ వైడ్ గా పెద్దగా లాభాలను ఏమి రాబట్టలేకపోయింది. ఇక సినిమాకు నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఇంకా 19కోట్ల వరకు రాబట్టాలి. ఇక ఇప్పుడు కేవలం ఆదివారంపైనే నమ్మకం పెట్టుకోవాలి. మరి సినిమా వీకెండ్స్ లో ఇంకా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.