మళ్ళీ ఏమైందో... రిలీజ్ డేట్ మార్చారు

By Srikanya

హైదరాబాద్ : ఓ సారి సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చాక దాన్ని మార్చటానికి సాధారణంగా దర్శక,నిర్మాతలు ఇష్టపడరు. ఎందుకంటే ఆ మార్పు ఖచ్చితంగా ఓపినింగ్స్ పై ఇంపాక్ట్ ఉంటుంది. అయితే రామ్ గోపాల్ వర్మ, మంచు విష్ణు కాంబినేషన్ లో రూపొందుతున్న ‘అనుక్షణం' చిత్రం మొదట నుంచి విడుదల తేదీలు మార్చుకుంటూ వస్తోంది. ఈ పోస్ట్ ఫోన్ లకు రకరకాలు కారణాలు చెప్తున్నా బిజినెస్ సమస్యే రిలీజ్ డేట్ ని మార్చుకుంటూ రావటానికి కారణమని చెప్పుకుంటున్నారు.

ఇక రీసెంట్ గా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే కారణాలు తెలియలేదు కానీ దాన్ని సెప్టెంబర్ 13 కి ఛేంజ్ చేసినట్లు సమాచారం. . ఈ చిత్రాన్ని మలయాళంలో ‘కిల్లర్' పేరుతో ఈ సినిమాను అనువదిస్తున్నారు. మలయాళంలో కూడా సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నట్టు దర్శకుడు వర్మ ప్రకటించారు. నవదీప్, తేజస్వి, మధుశాలిని, రేవతి, బ్రహ్మానందం తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Manchu Vishnu's ‘Anukshanam’ Release Date Postponed

వర్మ మాట్లాడుతూ... సైకో కిల్లర్ కధాంశంతో ‘అనుక్షణం' సినిమాను రూపొందించాం. ఈ సినిమా యూనివర్సల్ అప్పీల్ తో తెరకెక్కింది. థియేటర్లో ప్రతి ప్రేక్షకుడు మంచు విష్ణు క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతారు. సినిమాలో ఒక్కో అమ్మాయి చంపబడిన తర్వాత విష్ణు ఆ కేసును చేదించే క్రమం, సన్నివేశాలు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతాయి. అని వర్మ అన్నారు. తెలుగుతో పాటు మలయాళంలో కూడా ఒకే రోజున విడుదల చేస్తున్నాం అని తెలిపారు.

చిత్రం కథ ఏమిటంటే... ‘‘హైదరాబాద్‌ నగరంలో భయానక వాతావరణాన్ని సృష్టించిన ఓ సీరియల్‌ సెక్స్‌ కిల్లర్‌ కథ ఈ చిత్రం. ఈ కిల్లర్‌ కారణంగా రాత్రి ఏడు గంటల తర్వాత మహిళలు తమ ఇళ్లనుంచి బయటకు రావొద్దని పోలీస్‌ కమీషనర్‌ హెచ్చరించే స్థితి ఏర్పడుతుంది. రెస్టారెంట్లు ఖాళీ అయిపోతాయి. థియేటర్లలో రాత్రి ఆటలు రద్దవుతాయి. నగరం రాత్రివేళ నిర్మానుష్యంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మరింతమంది యువతులను చంపడానికి ప్రయత్నించే హంతకుణ్ణి పోలీసులు పట్టుకోగలిగారా, లేదా? అనేది ఇందులోని ప్రధానాంశం. పూర్తిగా సీరియల్‌ కిల్లర్‌ ప్రధానంగా భారతదేశంలో రూపొందిన మొదటి సినిమా ఇదే'' అని వర్మ తెలిపారు. తేజస్వి, మధుశాలిని, రేవతి, నవదీప్‌ ఇతర ముఖ్య పాత్రల్లో ఈ చిత్రం రూపొందింది. ఏవీ పిక్చర్స్‌ చిత్రాన్ని నిర్మిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X