Mangalavaaram Collections రికార్డు ఓపెనింగ్స్‌తో మంగళవారం.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంగళవారం. స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 17వ తేదీన రిలీజైంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాంటి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఎంత బిజినెస్ అయింది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
హైపర్ సెక్సువల్ డిజార్డర్ అనే టిపికల్ పాయింట్‌తో ఫన్, ఎమోషనల్ అంశాలతో రూపొందిన మంగళవారం సినిమా రిలీజ్ తర్వాత తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. రిలీజ్‌కు ముందు ప్రదర్శించిన పెయిడ్ ప్రీమియర్లకు అనూహ్యమైన స్పందన లభించింది.దాంతో సినిమాకు అన్ని వర్గాల నుంచి భారీ స్పందన వ్యక్తమవుతున్నది.

మంగళవారం సినిమాలో భారీ తారాగణానికి చోటు కల్పించారు. కథ డి17 చేయడంతో ప్రతిభావంతులైన నటీనటులను తీసుకొన్నారు. 100 రోజులపాటు అవుట్ డోర్ షూటింగ్, యాక్టర్ల పరితోషికాలతో కలిపి మొత్తంగా ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లకుపైగానే అయిందనేది ట్రేడ్ వర్గాల సమాచారం. కథ డిమాండ్ చేయడం, క్వాలిటీ కోసం రాజీ పడకూడదనే అనుకొన్నాం. దాంతో మొదలు అనుకొన్న బడ్జెట్ కంటే.. ఈ సినిమాకు ఎక్కువగానే ఖర్చుపెట్టామని నిర్మాతలు కూడా చెప్పడం గమనార్హం.
మంగళవారం సినిమా టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్ భారీ ఆదరణ లభించడం, సినిమాకు భారీ బజ్ క్రియేట్ కావడంతో బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమాను సుమారుగా 27 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ రిపోర్టు. డిమాండ్‌కు తగినట్టుగా నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేయగా.. ఆంధ్రాలో పలువురు డిస్ట్రిబ్యూటర్లు భారీగా చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకొన్నారు.

మంగళవారం సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అన్ని ఏరియాలోను భారీ ఆక్యుపెన్సీ కనిపించింది. తెలుగులో ఈ సినిమాకు ఓవరాల్‌గా 55 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం ఆటతో స్లోగా ప్రారంభమైన ఆక్యుపెన్సీ.. మధ్యాహ్నం, ఫస్ట్ షో, సెకండ్ షోకు భారీ స్పందన లభించింది. దాంతో ఈ సినిమా ఏపీ, నైజాం, ఇతర రాష్ట్రాల్లో 5 కోట్ల షేర్..8 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఓవర్సీస్‌లో వసూలయ్యే కలెక్షన్లు బట్టి భారీగానే బాక్సాఫీస్ వద్ద నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఇక మంగళవారం సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 30 కోట్ల వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది. తొలి రోజు ఈ సినిమా 8 నుంచి 10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలి రోజు ఊపు కొనసాగితే ఈ సినిమా తొలి వారం లాభాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











