Ponniyin Selvan 1 collections: మరో రికార్డును అందుకున్న మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. సంచలనం!
సౌత్ సినిమా మార్కెట్ వాల్యూ ప్రతీ ఎడాది అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక తమిళ సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా బాగానే రానిస్తున్నాయి.
ఇక పొన్నియిన్ సెల్వన్: I కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన రికార్డును అందుకుంది. ఈ సినిమా కథ చారిత్రాత్మక నేపథ్యంలో చోళ చక్రవర్తి రాజరాజ I అరుల్మొళివర్మన్ (పొన్నియిన్ సెల్వన్) జీవిత ఆధారంగా తెరకెక్కింది.
అరుల్మొళివర్మన్ పాత్రలో జయం రవి నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. PS 1 ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదలైంది. ట్రేడ్ అనలిస్ట్ ల ప్రకారం PS1 సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 500 కోట్లు వసూలు చేసింది. ఈ వారం థియేటర్లలో 50వ రోజుకి అడుగుపెట్టిన ఈ సినిమా ఇప్పుడు అరుదైన రికార్డును సొంతం చేసుకొని టాప్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

శంకర్ రజనీకాంత్ కలయికలో వచ్చిన 2.0 తర్వాత భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న రెండో తమిళ సినిమా ఇదే. గ్లోబల్ గా బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల వసూళ్లు అందుకోవడంతో ఇప్పుడు మణిరత్నం సెకండ్ పార్ట్ ను అంతకుమించి అనేలా తెరపైకి తీసుకు రావాలని ఫిక్స్ అయ్యారు. ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యదిక బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల లిస్టులోకి వెళితే.. RRR, KGF 2, బాహుబలి 1, 2 బాక్సాఫీస్ వసూళ్లలో 500 కోట్లు అందుకున్నాయి.
ఇక ఇప్పుడు PS 1 ఆ రికార్డును అందుకుంది. అసలు మొదట పొన్నియిన్ సెల్వన్ సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. తమిళంలో ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చినప్పటికీ తెలుగులో అంతగా రాలేదు. ఇక తెలుగులో అయితే మెల్లగా కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. ఇక ఈ సినిమా 500 కోట్లు అందుకోవడం సాధ్యమేనా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ 50 రోజులకు కూడా సినిమా కలెక్షన్స్ నిలకడగా ఉండడం విశేషం. ఏదిఏమైనా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కు మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు తమిళ మార్కెట్ స్థాయి మరికొంత పెరిగినట్లు అయ్యింది.


Click it and Unblock the Notifications











