మణరత్నం 'విలన్' లాస్ ఎంత?
మణిరత్నం తాజా చిత్రం రావణ్ (విలన్) భాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ సినిమాగా నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తెలుగు వెర్షన్ లాస్ పదకొండు కోట్ల వరకూ ఉండవచ్చనని అంచనా. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ని పదిహేను కోట్ల వరకూ లెక్కవేసి అమ్మే ప్రయత్నం చేసారు. ఎందుకంటే ఆ బడ్జెట్ కు తెలుగు షేర్ ఆ మాత్రం పడుతుందని చెప్పారు. అయితే తెలుగు స్టార్స్ ఎవరూ లేని ఈ చిత్రాన్ని ఆ రేటుకు కొనటానికి ముందుకు రాలేదు. దాంతో రిలియన్స్ వారు స్వయంగా రిలీజ్ చేసుకున్నారు. అయితే పబ్లిసిటీ కి పెట్టిన ఖర్చు, అనుకున్న షేరు లెక్కవేస్తే తమకు తెలుగు వెర్షన్ కు గానూ లాస్ పదకొండు కోట్లు అని తేలినట్లు తెలుస్తోంది. ఉన్నంతలో ఓపినింగ్స్ బాగా తెచ్చుకోవటం ఈ సినిమాకు కలిసివచ్చిన అంశం. అయితే అన్ని భాషల్లోనూ ఇనానమస్ గా ప్లాఫ్ టాక్ తెచ్చుకోవటం సినిమాను ట్రేడ్ పరంగా బాగా దెబ్బతీసింది.


Click it and Unblock the Notifications