క్రిష్ వివాదం.. మణికర్ణిక’ వసూళ్లపై ఎఫెక్ట్ పడిందా? 10 రోజుల కలెక్షన్ డీటేల్స్
ఝాన్సీ రాణి లక్ష్మీభాయి జీవితం ఆధారంగా రూపొందిన 'మణికర్ణిక' చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశాజనకమైన వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. త్వరలో ఈ చిత్రం రూ. 100 కోట్ల వసూళ్లను అందుకోవడం ఖాయం అంటున్నారు సినీ ట్రేడ్ విశ్లేషకులు. హిస్టారికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ జనవరి 25న విడుదలైన బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 10 రోజుల రన్ పూర్తి చేసుకుంది.
కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం 5 రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్కును అందుకోగా... తాజాగా రూ. 75 కోట్ల క్లబ్‌లో చేరింది. 10 రోజుల్లో ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 76.65 కోట్లు రాబట్టింది.

పోటీని తట్టుకుని..
ఈ వారం విడుదలైన సోనమ్ కపూర్ మూవీ ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా' బాక్సాఫీసు వద్ద పోటీ ఇస్తున్నప్పటికీ ‘మణికర్ణిక' కలెక్షన్లు స్టడీగా ఉండటం గమనార్హం. మరో వైపు సినిమా పైరసీకి గురైనా, తమిళరాకర్స్ లాంటి వాటిలో ఫ్రీ డౌన్లోడ్ వెర్షన్ దర్శనమిస్తున్నా బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోంది.

మేకింగ్ స్టైల్ మరింత ప్లస్
రాణి లక్ష్మీ భాయి జీవితం ఆధారంగా రూపొందిన ఈచిత్రం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైనప్పటికీ... పలు కారణాలతో కంగనా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సినిమాలో కొన్ని మార్పలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా మేకింగ్ స్టైల్ ఆకట్టుకునే లా ఉండటం మరింత ప్లస్ అయింది.

అబ్బురపరిచన కంగనా పెర్ఫార్మెన్స్
వీరనారి పాత్రలో కంగనా రనౌత్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టడం, ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ఆదరణ లభించడానికి దోహదం చేశాయి. కంగనా కెరీర్లోని ఉత్తమ చిత్రాల్లో ఇది నిలవడం ఖాయం అంటున్నారు.

‘మణికర్ణిక' వివాదం
‘మణికర్ణిక' విడుదల తర్వాత దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మీడియా ముందుకు వచ్చి కంగనా రనౌత్ సినిమా చిత్రీకరణ సమయంలో మూర్ఖంగా ప్రవర్తించిన తీరు, సదాశివరావు పాత్ర విషయంలో చరిత్రను వక్కీకరించే మార్పులు కోరి తాను పక్కకు తప్పుకునేలా చేసిన వైనం, తనకు సరైన క్రెడిట్ ఇవ్వక పోవడాన్ని తప్పుబడుతూ మీడియాకెక్కడం... వివాదానికి దారి తీసింది. అయితే గొడవ సినిమా వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపలేక పోయింది.


Click it and Unblock the Notifications











