బాక్సాఫీస్‌పై కంగన వసూళ్ల దాడి.. 100 కోట్ల క్లబ్‌పై మణికర్ణిక స్వైరవిహారం
వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక చిత్రం బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తున్నది. వివాదాల మధ్య ఈ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లను సాధించింది. దర్శకత్వం అంశంపై క్రిష్ జాగర్లమూడి, కంగన రనౌత్ మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. మూడో వారాల్లో మణికర్ణిక సినిమా వంద కోట్ల క్లబ్‌కు చేరువైంది. గత మూడు వారాల్లో ఈ చిత్రం సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..

మూడో వారాంతం కలెక్షన్లు
మూడో వారాంతంలో అంటే శనివారం, ఆధివారం మణికర్ణిక సినిమా వసూళ్లు నిలకడగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం శుక్రవారం రూ.1.25 కోట్లు, శనివారం రూ.2.65 కోట్లు, ఆదివారం రూ.3.25 కోట్లు సాధించింది. మొత్తంగా మూడో వారాంతం కలెక్షన్లతో ఈ చిత్రం రూ.91.70 కోట్ల వద్ద నిలిచింది.

రూ.100 కోట్ల దిశగా
మణికర్ణిక చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిస్టారికల్ డ్రామాకు ప్రేక్షకుల ఆదరణ లభించడంతో ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. అదే ఊపుతో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడానికి సిద్ధమైంది.

మూడోవారంలో కలెక్షన్లు
మణికర్ణిక చిత్రం తొలివారం ముగిసే సమయానికి రూ.61.15 కోట్లు వసూలు చేసింది. రెండోవారం ముగిసే సమయానికి రూ. 23.40 కోట్లు, మూడో వారాంతం రూ.7.15 కోట్లు రాబట్టింది. నాలుగో వారాంతానికి ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

క్రిష్, కంగన వివాదం
ప్రముఖ నిర్మాత కమల్ జైన్ రూపొందించిన మణికర్ణిక చిత్రానికి తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించే అవకాశం రావడంతో మధ్యలోనే క్రిష్ ఈ ప్రాజెక్ట్‌కు గుడ్‌బై చెప్పారు. అనంతరం ఈ చిత్రాన్ని హీరోయిన్ కంగన రనౌత్ పూర్తి చేసింది. దర్శకత్వం టైటిల్‌ను కంగన వేసుకోవడంపై క్రిష్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదంగా మారింది.


Click it and Unblock the Notifications











