twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్‌పై కంగన వసూళ్ల దాడి.. 100 కోట్ల క్లబ్‌పై మణికర్ణిక స్వైరవిహారం

    |

    వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక చిత్రం బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తున్నది. వివాదాల మధ్య ఈ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లను సాధించింది. దర్శకత్వం అంశంపై క్రిష్ జాగర్లమూడి, కంగన రనౌత్ మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. మూడో వారాల్లో మణికర్ణిక సినిమా వంద కోట్ల క్లబ్‌కు చేరువైంది. గత మూడు వారాల్లో ఈ చిత్రం సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..

    మూడో వారాంతం కలెక్షన్లు

    మూడో వారాంతం కలెక్షన్లు

    మూడో వారాంతంలో అంటే శనివారం, ఆధివారం మణికర్ణిక సినిమా వసూళ్లు నిలకడగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం శుక్రవారం రూ.1.25 కోట్లు, శనివారం రూ.2.65 కోట్లు, ఆదివారం రూ.3.25 కోట్లు సాధించింది. మొత్తంగా మూడో వారాంతం కలెక్షన్లతో ఈ చిత్రం రూ.91.70 కోట్ల వద్ద నిలిచింది.

    రూ.100 కోట్ల దిశగా

    రూ.100 కోట్ల దిశగా

    మణికర్ణిక చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిస్టారికల్ డ్రామాకు ప్రేక్షకుల ఆదరణ లభించడంతో ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. అదే ఊపుతో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడానికి సిద్ధమైంది.

    <strong>ఒక్కొక్కరి అంతు చూస్తా, రాసలీలలన్నీ బయట పెడతా.. వైరల్ అవుతున్న హీరోయిన్ వీడియో!</strong>ఒక్కొక్కరి అంతు చూస్తా, రాసలీలలన్నీ బయట పెడతా.. వైరల్ అవుతున్న హీరోయిన్ వీడియో!

     మూడోవారంలో కలెక్షన్లు

    మూడోవారంలో కలెక్షన్లు

    మణికర్ణిక చిత్రం తొలివారం ముగిసే సమయానికి రూ.61.15 కోట్లు వసూలు చేసింది. రెండోవారం ముగిసే సమయానికి రూ. 23.40 కోట్లు, మూడో వారాంతం రూ.7.15 కోట్లు రాబట్టింది. నాలుగో వారాంతానికి ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

    క్రిష్, కంగన వివాదం

    క్రిష్, కంగన వివాదం

    ప్రముఖ నిర్మాత కమల్ జైన్ రూపొందించిన మణికర్ణిక చిత్రానికి తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించే అవకాశం రావడంతో మధ్యలోనే క్రిష్ ఈ ప్రాజెక్ట్‌కు గుడ్‌బై చెప్పారు. అనంతరం ఈ చిత్రాన్ని హీరోయిన్ కంగన రనౌత్ పూర్తి చేసింది. దర్శకత్వం టైటిల్‌ను కంగన వేసుకోవడంపై క్రిష్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదంగా మారింది.

    English summary
    Manikarnika: The Queen Of Jhansi hit the theatres on January 25. The film is off to a fabulous start. This movie racing towards Rs.100 crores club.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X