twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫస్ట్ వీక్ రిపోర్ట్: ‘మణికర్ణిక’ పరిస్థితి అంతేనా? ఆదరణ లేని ‘థాకరే’, కానీ..

    |

    Recommended Video

    Manikarnika And Thackeray Both Are In Negative Talk | Filmibeat Telugu

    కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక' చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద పరిస్థితి ఫర్వాలేదనే విధంగా ఉంది. ఝాన్సీ రాణి లక్ష్మీ భాయి జీవితంపై రూపొందిన ఈ పీరియర్ మూవీ చుట్టూ పలు వివాదాలు ముసురుకున్నా వసూళ్లపై పెద్ద ప్రభావం చూపలేదు.

    అయితే ఈ సినిమాతో పాటు విడుదలైన మహారాష్ట్ర లీడర్, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే జీవితంపై రూపొందిన 'థాకరే' చిత్రం బాక్సాఫీసు రేసులో వెనకబడింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద తొలి వారం పూర్తి చేసుకున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

    మణికర్ణిక ఫస్ట్ వీక్ కలెక్షన్స్

    మణికర్ణిక ఫస్ట్ వీక్ కలెక్షన్స్

    ‘మణికర్ణిక' చిత్రాన్ని ఇండియా వైడ్ హిందీ, తెలుగు, తమిళంలో కలిపి 3 వేల స్క్కీన్స్, ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు 700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఆశించిన అంచనాలను అందుకోవడంలో విఫలం అయినప్పటికీ ఆశాజనకమైన వసూళ్లు సాధించింది. తొలి 6 రోజుల్లో రూ. 56.90 కోట్లు రాబట్టిన ఈ మూవీ... 7 వరోజు దాదాపు రూ. 4.10 కోట్లు వసూలు చేసింది. దీంతో ఫస్ట్ వీక్ వసూళ్లు రూ. 60 కోట్లకు చేరుకుంది.

    సెకండ్ వీక్ 60 శాతం స్క్రీన్లు

    సెకండ్ వీక్ 60 శాతం స్క్రీన్లు

    రెండో వారంలో దాదాపు 60 శాతం స్క్రీన్లను నిలుపుకోవడంలో నిర్మాతలు సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో సెకండ్ వీక్ ‘మణికర్ణిక' మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సెకండ్ వీకెండ్ వసూళ్లపై నిర్మాతలు భారీ ఆశలు పెట్టుకున్నారు.

    థాకరే..

    థాకరే..

    ‘థాకరే' చిత్రానికి పెద్దగా ఆదరణ లభించడం లేదు. సినిమా విడుదలైన చాలా చోట్ల ఖాళీ థియేటర్లు దర్శనమిచ్చాయి. అయితే మహారాష్ట్రలో విడుదలైన మరాఠీ వెర్షన్ కాస్త ఫర్వాలేదనిపించింది. రూ. 25 కోట్ల నుంచి 30 కోట్ల బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రానికి తొలి వారం పెట్టుబడి రికవరీ అయినట్లు తెలుస్తోంది.

    మణికర్ణిక బడ్జెట్ రికవరీ అవుతుందా?

    మణికర్ణిక బడ్జెట్ రికవరీ అవుతుందా?

    అయితే ‘మణికర్ణిక' చిత్రాన్ని రూ. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. సినిమాకు రూ. 120 కోట్ల షేర్ వస్తే తప్ప హిట్ అయ్యే పరిస్థితి లేదు. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద వస్తున్న స్పందన చూస్తుంటే అది కష్టమే అనే అభిప్రాయాలు ట్రేడ్ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

    English summary
    Kangana Ranaut's Manikarnika released across 3,000 screens in india and 700 screens overseas, may have underperformed and failed to meet the expectations but it managed to maintain a good hold at the box office by earning Rs 60 crore in 7 days of its release. Thackeray, on the other hand, may have not been able to find audience in many parts of the country, it, however, managed to get a good grip in Maharashtra circuit for its Marathi version.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X