PS2 Collections: 300 కోట్లు దాటిన పొన్నియన్ సెల్వన్ 2.. అయినా రాని లాభాలు.. హిట్ కావాలంటే?
తమిళ అగ్ర దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన చిత్రం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మంచి విజయం సాధించింది. దీంతో ఆయన రెండో పార్టును కూడా తెరకెక్కించి ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా కలెక్షన్ల పరంగా సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమా 12 రోజుల కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
నటీనటులు : చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి అగ్ర తారలు నటించిన చిత్రమే పొన్నియన్ సెల్వన్ 2. మొదటి పార్టుకు మంచి హిట్ కావడంతో రెండు పార్టును చిత్రీకరించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై మణిరత్నం, సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ : మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2. ఈ సినిమాను సుమారుగా రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీకి తమిళంలో రూ. 80 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 21 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 50 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 170 కోట్ల బిజినెస్ అయినట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో : చోళుల కాలం నాటి కథతో రూపొందిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2కి తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలు కలుపుకును 12వ రోజున మొత్తంగా రూ. 5 లక్షలు మాత్రమే వసూళు అయింది. ఇక 12 రోజుల్లో నైజాంలో రూ. 3.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 55 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 58 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణాలో రూ. 42 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో మొత్తంగా రూ. 6.62 కోట్లు షేర్, రూ. 14.05 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత? లాభం రావాలంటే : క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో దీనికి రూ. 6.62 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 3.88 కోట్లు వసూలు అయితేనే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ గా నిలుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా.. హిట్ కావాలంటే : పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2కు 12 రోజులకు కలిపి తెలుగులో రూ. 14.05 కోట్లు, తమిళంలో రూ. 114.25 కోట్లు, కర్నాటకలో రూ. 19.50 కోట్లు, కేరళలో రూ. 15.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 22.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 116.65 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లో రూ. 302.25 కోట్లు గ్రాస్, రూ. 145.30 కోట్లు షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ. 26.70 కోట్లు కలెక్ట్ చేయాలి.


Click it and Unblock the Notifications











