Box Office Records 5 కోట్ల బడ్జెట్.. 100 కోట్లకు చేరువగా అడ్వెంచరస్ థ్రిల్లర్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే!

మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boy Collections) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం వైపు దూసుకెళ్తున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా తొలి ఆట నుంచే రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. రెండోవారంలోకి ప్రవేశించిన ఈ చిత్రం కలెక్షన్లపరంగా ఇంకా స్ట్రాంగ్‌గా, నిలకడగా ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

అడ్వెంచర్, సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందిన మంజుమ్మేల్ బాయ్స్ ఫిబ్రవరి 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. షాహిర్, శ్రీనాథ్ బాసీ, బాలు వర్గీస్, దీపక్ పరాంబో లాంటి సీనియర్ నటులతోపాటు జూనియర్ నటులతో సినిమాను రూపొందించారు. ఈ సినిమాను 5 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ మూవీని మలయాళంలో 400 స్క్రీన్లు, ఇతర నగరాల్లో 100 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Manjummel Boys 10 days Expected Collections Worldwide Here is the Profit Ratio

మంజుమ్మేల్ బాయ్స్ చిత్రం తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల (Manjummel Boy Collections) వేట మొదలుపెట్టింది. తొలి రోజు 3.3 కోట్లు, రెండో రోజు 3.25 కోట్ల రూపాయలు, మూడో రోజు 4.5 కోట్లు, నాలుగో రోజు 4.7 కోట్లు, ఐదో రోజు 3 కోట్లు, ఆరో రోజు 3 కోట్ల రూపాయలు, ఏడో రోజు 2.8 కోట్లు, ఎనిమిదో రోజు 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

మంజుమ్మేల్ బాయ్స్ చిత్రం తొలివారం ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 27 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా (Manjummel Boy Collections) భారీగానే వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ అమెరికా, ఇతర దేశాల్లో సుమారుగా 25 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. దాంతో తొలివారమే ఈ సినిమా 50 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది.

ఇక మంజుమ్మేల్ బాయ్స్ మూవీ రెండోవారంలో కూడా రికార్డు వసూళ్లను సాధించింది. తొలి వారంలో ఫస్ట్ డే కంటే భారీగా కలెక్షన్లను నమోదు చేసింది. 9వ రోజున ఈ సినిమా మలయాళం ఇతర భాషల్లో కలిపి 4 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక 10వ రోజున ఈ సినిమా 3.5 కోట్ల రూపాయలను వసూలు చేస్తుందని (Manjummel Boy Collections) ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా ఇండియాలో 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Manjummel Boys 10 days Expected Collections Worldwide Here is the Profit Ratio

ఇక మంజుమ్మేల్ బాయ్స్ సినిమా 5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ప్రస్తుతం ఇండియాలో 34 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా (Manjummel Boy Collections) ప్రపంచవ్యాప్తంగా 64 కోట్ల రూపాయలను రాబట్టింది. సుమారుగా 60 కోట్ల రూపాయలు లాభంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X