Manjummel Boys Telugu Collections తెలుగులో మంజమ్మల్ Boys రికార్డు ఓపెనింగ్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?

మలయాళంలో సంచలన విజయం సాధించిన మంజుమ్మల్ Boys చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి ఏప్రిల్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. బీన్ షాహీర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి ఎస్ పోడువల్, లాల్ జూనియర్, దీపక్ పరాంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. అయితే తెలుగు వెర్షన్ మూవీ ఎలాంటి రెస్పాన్స్ కూడగట్టుకొంటున్నది? ఏ మేరకు కలెక్షన్లు రాబడుతున్నదనే వివరాల్లోకి వెళితే..

అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా, సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన మలయాళ చిత్రాన్ని సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను కేవలం మలయాళం, తమిళ భాషలో రిలీజ్ చేశారు. అయితే ఫిబ్రవరి 22వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 221 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Manjummel Boys Day 1 Telugu States Box Office Collections Chidambaram s Survival Drama Good Start

మలయాళం, తమిళ భాషలోనే ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ సినిమాకు భారీగా ఆదరణ లభించింది. దాంతో ఈ చిత్రం దాదాపు 75 కోట్ల రూపాయలు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, యూఏఈ దేశాల్లో వసూలు చేసింది. 45 రోజుల తర్వాత కూడా ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా వసూళ్లు రాబడుతున్నది.

ఇక ఏప్రిల్ 6వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తమిళ, మలయాళ భాషల్లో వచ్చిన స్పందన మాదిరిగానే ఈ చిత్రం కలెక్షన్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం తొలి రోజు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో థియేటర్లు కళకళలాడాయి. దాంతో భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు.

Manjummel Boys Day 1 Telugu States Box Office Collections Chidambaram s Survival Drama Good Start

ఇక మంజుమ్మల్ Boys మొదటి రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. తెలుగు చిత్రాలకంటే ఎక్కువగా రెస్పాన్స్ కనిపించింది. హైదరాబాద్‌లో 60 శాతం, వరంగల్‌లో 80 శాతం, మహబూబ్ నగర్‌లో 75 శాతం, గుంటూరు, కాకినడా, వైజాగ్, విజయవాడ, గుంటూరు నగరాల్లో ఈ సినిమా 50 శాతం మేర ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది.

మంజుమ్మల్ Boys చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడంతో థియేట్రికల్ రన్ గ్రాండ్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తొలి రోజు ఆంధ్రా, నైజాంలో కలిపి మొత్తంగా 3 నుంచి 3.5 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. రెండో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X