Manjummel Boys 100 Crores మంజుమ్మేల్‌ బాయ్స్‌కు 100 కోట్ల కలెక్షన్లు.. యూఎస్‌లో చరిత్ర సృష్టించిన మల్లు మూవీ

దక్షిణాది ఇండస్ట్రీలో మంజుమ్మేల్ బాయ్స్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను నమోదు చేస్తున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ మలయాళ, తెలుగు, తమిళ, కర్ణాటక రాష్ట్రాలో తుఫాన్ మాదిరిగా ఎడతెరిపి లేకుండా కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ సినిమా గత 12 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొంాదిన మంజుమ్మేల్ బాయ్స్ చిత్రాన్ని 5 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు మలయాళంలో బజ్ క్రియేట్ చేయడంతో భారీగా రిలీజ్ చేశారు. ఈ మూవీని మలయాళంలో 400 స్క్రీన్లు, ఇతర నగరాల్లో 100 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. రిలీజ్ తర్వాత డిమాండ్ పెరగడంతో తమిళనాడులో భారీగా స్క్రీన్లను పెంచారు.

Manjummel Boys Day 12 Box Office Collections Worldwide Movie gets 100 crores worldwide

మంజుమ్మేల్ బాయ్స్ చిత్రం తొలివారం మలయాళంలోనే సుమారుగా 26.5 కోట్ల రూపాయలు సాధించింది. ఆ తర్వాత తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఊపందుకొన్నాయి. దాంతో 9వ రోజు 4 కోట్ల రూపాయలు, 10వ రోజు 8 కోట్ల రూపాయలు, 11వ రోజు 10 కోట్ల రూపాయలు, 12వ రోజు 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Recommended Video

Manjummel Boys కు 100 కోట్ల కలెక్షన్లు..చరిత్ర సృష్టించిన Malayalam Movie | Filmibeat Telugu

ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాకు భారీ ఆదరణ దక్కుతున్నది. ఈ చిత్రం అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. గతంలో లూసిఫర్ సినిమా నమోదు చేసిన కలెక్షన్లను తిరగరాసింది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

Manjummel Boys Day 12 Box Office Collections Worldwide Movie gets 100 crores worldwide

ఈ చిత్రం అమెరికాలో 700K డాలర్లను వసూలు చేసింది. కేవలం అమెరికా, కెనడాలోనే ఈ చిత్రం 5.5 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో అంటే యూకే, ఇతర దేశాల్లో కలిపితే ఈ సినిమా 5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో 45 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

ఇక మంజుమ్మేల్ బాయ్స్ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కేరళలో ఈ సినిమా ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక తమిళనాడులో 16 కోట్ల రూపాయులు రాబట్టింది. తెలుగు, కర్నాటకలో కలిపి 7 కోట్ల వరకు కలెక్షన్లను వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 45 కోట్లతో కలుపుకొని ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X