Manjummel Boys 2 days Collections బాక్సాఫీస్‌పై జైత్రయాత్ర.. రెండో రోజే లాభాల్లోకి.. ఎన్ని కోట్లంటే?
మలయాళ భాషలో రూపొందిన అడ్వెంచర్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రం మంజుమ్మేల్ బాయ్స్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఇప్పటికే మలయాళ బాక్సాఫీస్ వద్ద ప్రేమలు, భ్రమయుగం సినిమాలు స్ట్రాంగ్‌గా కలెక్షన్లను రాబడుతున్నప్పటికీ.. ఆ రెండు సినిమాల పోటీని తట్టుకొని మంజుమ్మేల్ బాయ్స్ చిత్రం రికార్డు వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా 2వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
చిదంబరం దర్శకత్వంలో రూపొందిన మంజుమ్మేల్ బాయ్స్ మూవీ ఫిబ్రవరి 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. షాహిర్, శ్రీనాథ్ బాసీ, బాలు వర్గీస్, దీపక్ పరాంబో లాంటి సీనియర్ నటులతోపాటు జూనియర్ నటులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు సాధారణ ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

మంజుమ్మేల్ బాయ్స్ సినిమాను మీడియం రేంజ్ బడ్జెట్‌తో రూపొందించారు. అన్ని ఖర్చులతో కలిపి ఈ సినిమాను 5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను మలయాళంలో 400 స్క్రీన్లు, ఇతర నగరాల్లో 100 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలి రోజే దాదాపు బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది.
మంజుమ్మేల్ బాయ్స్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టింది. మలయాలంలో 3.5 కోట్ల నికరంగా, 4.5 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 2.5 కోట్ల రాబట్టింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక మంజుమ్మేల్ బాయ్స్ మూవీ రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మలయాళంలో 3 కోట్ల రూపాయలు నికరంగా, 3.5 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం రెండో రోజు 5.5 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.
మంజుమ్మేల్ బాయ్స్ మొత్తం రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తొలి రోజు 7 కోట్లు, రెండో రోజు 5.5 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సినిమా రెండు రోజుల్లో మొత్తంగా 12.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే భారీ లాభాల్లోకి ప్రవేశించడమే కాకుండా ఇటీవల కాలంలో అత్యధిక లాభాలను సాధించిన చిత్రాల జాబితాలో చేరింది.


Click it and Unblock the Notifications











