Manjummel Boys 20 days Collections 200 కోట్లకు చేరువగా మంజుమ్మేల్ బాయ్స్.. మమ్ముట్టి, మోహన్‌లాల్ రికార్డు ఫట్!
మలయాళ సినిమా పరిశ్రమలో సంచలన విజయం సాధించిన చిత్రం మంజుమ్మేల్ బాయ్స్. అడ్వెంచర్, సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో షాహిర్, శ్రీనాథ్ బాసీ, బాలు వర్గీస్, దీపక్ పరాంబో తదితరులు నటించారు. ఫిబ్రవరి 22వ తేదీన మలయాళ, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన నగరాల్లో ఈ మూవీని రిలీజ్ చేశారు. చిన్న బడ్జెట్‌గా రిలీజై రికార్డు వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కొడైకెనాల్‌కు సమీపంలోని గుహా కేవ్స్‌లో రూపొందిన ఈ మూవీని సుమారుగా 5 కోట్ల రూపాయలతో రూపొందించారు. రిలీజ్‌కు ముందు కొంత బజ్ ఏర్పడటంతో మలయాళంలో 400 స్క్రీన్లు, ఇతర నగరాల్లో 100 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ప్రేక్షకుల నుంచి భారీగా డిమాండ్ ఏర్పడటంతో ఈ సినిమా స్క్రీన్లను భారీగా పెంచారు.

ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా మలయాళం, తమిళంలో భారీగా వసూళ్లను సాధించింది. తొలివారం ఈ చిత్రం 26 కోట్ల రూపాయలకుపైగా నికర వసూళ్లు కలెక్ట్ చేసింది. తొలివారం అందించిన సక్సెస్ టాక్ రెండోవారంలో కలెక్షన్లను భారీగా పెంచింది. 2వ వారం ఈ సినిమా 37.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో రెండు వారాల్లో 63.5 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
ఇక మూడో వారంలో కూడా మంజుమ్మేల్ బాయ్స్ భారీగానే వసూళ్లు రాబడుతున్నది. 16వ రోజు 5.5 కోట్లు, 17వ రోజు 8.5 కోట్లు, 18వ రోజు 9 కోట్ల రూపాయలు, 19వ రోజు ఈ సినిమా 3 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. దాంతో ఈ సినిమా మలయాళ, తమిళ భాషల్లోనే 100 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది.

తొలివారంలో వివిధ రాష్ట్రాల్లో సాధించిన వసూళ్ల విషయానికి వస్తే.. కర్ణాటకలో 3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రూపాయలు, తమిళనాడులో 3.75 కోట్లు, కేరళలో 25 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 60 లక్షలకుపైగా నికర వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా 32 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక 2వ వారం కలెక్షన్లను పరిశీలిస్తే.. కర్ణాటకలో 32 కోట్ల రూపాయలు, ఏపీ, నైజాంలో 50 లక్షలు, తమిళనాడులో 22 కోట్లు, కేరళలో 19 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయల కలెక్షన్లు రాబట్టింది.
మూడో వారంలో కూడా ఈ సినిమా స్ట్రాంగ్‌గా నిలబడింది. ఈ సినిమా కర్ణాటకలో 8 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు, తమిళనాడులో 40 కోట్ల రూపాయలు, కేరళలో 53 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1.91 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కేవలం దక్షిణాదిలోనే ఈ సినిమా 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

ఇక మంజుమ్మేల్ బాయ్స్ చిత్రం ఇండియాలో సుమారుగా 109 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ మూవీ 60 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 170 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. మలయాళంలో రికార్డు కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా ఘనతను సాధించింది. మమ్ముట్టి, మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి హీరోల సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది.


Click it and Unblock the Notifications











