Vijay Vs Ajith: అజిత్ మూవీ మంగాథ సరికొత్త చరిత్ర.. విజయ్, రజనీకాంత్ రికార్డులు అవుట్
తమిళనాడులో సినీ, రాజకీయ వాతావరణం పలు అంశాలతో రోజు రోజుకు ఓ పక్క వేడెక్కుతుంటే.. మరో పక్క రీ రిలీజ్ సినిమాల హడావిడి బాగా కొనసాగుతున్నది. భారీ బడ్జెట్ సినిమాలు, అగ్ర హీరోలు సినిమాలు లేకపోవడంతో ఇండస్ట్రీలో ఏర్పడిన అసందిగ్ధతను బ్రేక్ చేస్తూ దళపతి విజయ్, సూపర్ స్టార్ అజిత్ కుమార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా తమిళనాడులో జన నాయగన్ సినిమా రిలీజ్ వాయిదా వివాదం ఓ వైపు కొనసాగుతుంటే.. మరో వైపు విజయ్ ఫ్యాన్స్ ఆయన నటించిన థెరీ సినిమా రీ రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే అజిత్ ఫ్యాన్స్ కూడా తమ హీరో నటించి ముంబై బెట్టింగ్ మాఫియాపై రూపొందిన మంగాథ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలు తమిళనాట కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో ఇటీవల విడుదలైన భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో సినీ అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. జన నాయగన్ కూడా ఇప్పట్లో రిలీజ్ అవుతుందా? లేదా అనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో రీ రిలీజ్ సినిమాలపై దృష్టిపెట్టారు. విజయ్ నటించిన థెరీ, అజిత్ నటించిన మంగాథ చిత్రాలను రీ రిలీజ్‌కు సిద్దం చేశారు. ఈ రెండు సినిమాలు కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేస్తున్నాయి.

థెరీ, మంగాథ సినిమాలు కథ విషయానికి వస్తే.. రెండు పోలీస్ ఆఫీసర్ స్టోరీలే. థెరీలో విజయ్ నిజాయితీతో కూడిన పోలీస్ అధికారి అయితే.. మంగాథలో అవినీతి పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ రెండు సినిమాలు రిలీజ్ సమయంలో ఘన విజయం సాధించాయి. మళ్లీ ఇప్పుడు భారీ క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి.
మంగాథ చిత్రం తమిళనాడులో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. విజయ్ నటించిన గిల్లీ సినిమా తొలి రోజు కోసం 2.15 కోట్ల రూపాయల వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం అప్పట్లో రికార్డుగా భావించారు. ప్రస్తుతం అజిత్ నటించిన మంగాథ చిత్రం 2.16 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.
మంగాథ చిత్రం మూడు రాష్ట్రాలు అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటకలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేస్తున్నది. ఈ చిత్రం బెంగళూరులో రికార్డు వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ కోసం 13.75 లక్షల రూపాయలను రాబట్టడమే కాకుండా రజనీకాంత్ నటించిన పడయప్పా రీ రిలీజ్ వసూలు చేసిన 12.65 లక్షల రూపాయల కలెక్షన్లను అధిగమించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే థెరీ మూవీ రీ రిలీజ్ కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











